‘బహ్రెయిన్’ కింగ్ వెర్‌స్టాపెన్
ABN , Publish Date - Oct 05 , 2026 | 05:50 AM
రెడ్‌బుల్ ఎఫ్-1 డ్రైవర్ మ్యాక్స్ వెర్‌స్టాపెన్.. బహ్రెయిన్ గ్రాండ్ ప్రీ విజేతగా నిలిచాడు. ఈ ఏడాది...
సెపాంగ్ (మలేసియా): రెడ్‌బుల్ ఎఫ్-1 డ్రైవర్ మ్యాక్స్ వెర్‌స్టాపెన్.. బహ్రెయిన్ గ్రాండ్ ప్రీ విజేతగా నిలిచాడు. ఈ ఏడాది అతడికి ఇదే తొలి టైటిల్. ఆదివారం జరిగిన ఫైనల్లో 55 ల్యాప్‌ల రేస్‌ను వెర్‌స్టాపెన్ గంటా 47 నిమిషాల 14.808 సెకన్ల టైమింగ్‌తో ముగించి అగ్రస్థానంలో నిలిచాడు. ఇక, ఈ సీజన్‌లో వరుస విజయాలతో జోరుమీదున్న మెర్సిడెస్ డ్రైవర్ కిమి ఆంటోనెల్లి అనూహ్యంగా రెండోస్థానంతో సరి పెట్టుకోగా, ఫెరారీ డ్రైవర్ హామిల్టన్‌కు మూడో స్థానం దక్కింది. కాగా, బహ్రెయిన్‌లో జరగాల్సిన ఈ రేసును ఇరాన్ యుద్ధం కారణంగా మలేసియాలో నిర్వహించారు.
ఇవి కూడా చదవండి:
కోల్‌కతాలో బ్రెజిల్ ఫుట్‌బాల్ ఫీవర్.. భారత్‌తో మ్యాచ్‌కు సాల్ట్ లేక్ స్టేడియం సిద్ధం
ఆసియా క్రీడల్లో భారత్ సత్తా.. మలేషియాపై 5-1 ఘన విజయం, హాకీలో స్వర్ణం..