Mary Koms Ex Husband Alleges: ఆమెకు ఇద్దరితో ఎఫైర్ ఉంది
ABN , Publish Date - Jan 14 , 2026 | 06:17 AM
అప్పులపాలయ్యేలా చేసి, తన ఆస్తి కాజేయడంతోనే విడాకులు తీసుకున్నామంటూ దిగ్గజ బాక్సర్ మేరీ కోమ్ ఇటీవల చేసిన ఆరోపణలను..
నా దగ్గర సాక్ష్యాలు ఉన్నాయి
మేరీపై మాజీ భర్త సంచలన ఆరోపణలు
న్యూఢిల్లీ: అప్పులపాలయ్యేలా చేసి, తన ఆస్తి కాజేయడంతోనే విడాకులు తీసుకున్నామంటూ దిగ్గజ బాక్సర్ మేరీ కోమ్ ఇటీవల చేసిన ఆరోపణలను ఆమె మాజీ భర్త కరుంగ్ ఓన్‌కోలర్ ఖండించాడు. అనవసర ఆరోపణలు చేస్తే తాను ఊరుకోనన్న కరుంగ్.. మేరీకి వివాహేతర సంబంధాలు ఉండేవంటూ సంచలన కామెంట్లు చేశాడు. ‘2013లో ఓ జూనియర్ బాక్సర్‌తో మేరీకి ఎఫైర్ ఉండేది. ఇది తెలిసి మా కుటుంబాల మధ్య గొడవ జరిగింది. పెద్దలు సర్దిచెప్పడంతో రాజీకి వచ్చాం. 2017 నుంచి మేరీ అకాడమీలో పనిచేస్తున్న ఓ వ్యక్తితో ఆమె సంబంధం కొనసాగిస్తోంది. ఇందుకు సాక్ష్యంగా వారిద్దరి వాట్సాప్ మెసేజ్‌లు నా దగ్గర ఉన్నాయి. అయినా సరే, ఇన్నాళ్లూ నిశ్శబ్దంగా ఉన్నా. ఇప్పటికీ నేను అద్దె ఇంట్లో ఉంటున్నా. ఆమె నుంచి నయా పైసా తీసుకోలేదు. ఆమె అకాడమీకి బీజం వేసింది నేను. కానీ, ఇప్పుడు ఆ అకాడమీకి చైర్మన్‌గా ఎవరున్నారో చూడండి. నన్ను వాడుకొని వదిలేసింది. తన ప్రవర్తనతో నన్ను చాలా బాధపెట్టింది’ అని ఓ చానెల్‌కిచ్చిన ఇంటర్వ్యూలో కరుంగ్ వాపోయాడు. మేరీ, కరుంగ్ పెళ్లి 2005లో జరిగింది. వీళ్లకు ముగ్గురు మగ పిల్లలు కాగా, ఓ పాపను దత్తత తీసుకున్నారు. 2023లో తమ సంప్రదాయం ప్రకారం విడాకులు తీసుకున్నామని గతేడాది మే నెలలో మేరీ ప్రకటించిన సంగతి తెలిసిందే.
ఇవి కూడా చదవండి:
ధనశ్రీతో రియాలిటీ షో.. ఆ వార్తలను ఖండించిన చాహల్
రో-కో నన్ను ‘చోటా చీకూ’ అని పిలిచారు: విరాట్ పోలికలతో ఉన్న బాలుడు