Mary Kom Opens Up: అదో చీకటి దశ
ABN , Publish Date - Jan 11 , 2026 | 05:31 AM
భర్తతో విడాకులు, దివాలా దశకు వచ్చిన ఆర్థిక పరిస్థితి.. వెరసి అది తన జీవితంలో చీకటి దశగా దిగ్గజ బాక్సర్ మేరీ కోమ్ అభివర్ణించింది...
న్యూఢిల్లీ: భర్తతో విడాకులు, దివాలా దశకు వచ్చిన ఆర్థిక పరిస్థితి.. వెరసి అది తన జీవితంలో చీకటి దశగా దిగ్గజ బాక్సర్ మేరీ కోమ్ అభివర్ణించింది. మేరీకోమ్, మాజీ ఫుట్‌బాలర్ ఆన్లెర్ రెండు దశాబ్దాల తమ వైవాహిక జీవితానికి ముగింపు పలుకుతూ 2023లో విడాకులు తీసుకోవడం సంచలనం సృష్టించింది. అయితే విడాకుల ఉదంతంలో తప్పంతా తనదనే అపవాదును మేరీ ఎదుర్కొంది. కానీ, ఆన్లెర్ తనను కోట్ల రూపాయలకు మోసం చేశాడని వెల్లడించింది. ‘నేను కష్టపడి సంపాదించిన ఆస్తులను కుదువపెట్టి లోన్లు తీసుకున్నాడు. తర్వాత ఆ ఆస్తులను తన పేరిట మార్చుకున్నాడు. చురాచాంద్‌పూర్ వాసుల నుంచి అప్పులు తీసుకున్నాడు. వాటిని రాబట్టుకొనేందుకు వారు అండర్‌గ్రౌండ్ గ్రూపుల ద్వారా నా భూమిని స్వాధీనం చేసుకున్నారు’ అని మేరీ వివరించింది. ఇవన్నీ భరించలేకే ఎంతో ఆలోచించి అతడి నుంచి విడాకులు తీసుకున్నట్టు తెలిపింది.
ఇవి కూడా చదవండి:
సునామీని తలపించిన సూర్యవంశీ బ్యాటింగ్
కెమెరామెన్‌పై స్మృతి మందాన అసహనం.. వీడియో వైరల్