ఐఎస్ఎస్ఎఫ్ అథ్లెట్స్ కమిటీ ఎన్నికల్లో మను భాకర్ పోటీ
ABN , Publish Date - Nov 03 , 2026 | 07:36 PM
భారత స్టార్ మహిళా షూటర్ మను భాకర్ ఇంటర్నేషనల్ షూటింగ్ స్పోర్ట్ ఫెడరేషన్ (ఐఎస్ఎస్ఎఫ్) అథ్లెట్స్ కమిటీ ఎన్నికల్లో పోటీ చేయనుంది. 2026-2030 కాలానికి పిస్టల్ విభాగంలో మను బరిలో నిలవనుంది.
స్పోర్ట్స్ డెస్క్: భారత స్టార్ మహిళా షూటర్ మను భాకర్(Manu Bhaker) ఇంటర్నేషనల్ షూటింగ్ స్పోర్ట్ ఫెడరేషన్ (ఐఎస్ఎస్ఎఫ్) అథ్లెట్స్ కమిటీ ఎన్నికల్లో పోటీ చేయనుంది. 2026-2030 కాలానికి పిస్టల్ విభాగంలో మను బరిలో నిలవనుంది. ఈ కేటగిరీలో ఉన్న రెండు పదవుల కోసం 10 మంది అభ్యర్థులు పోటీపడుతున్నారు. ఈ పదిమందిలో మను భాకర్ ఒకరు.
మను భాకర్ మీడియాతో మాట్లాడుతూ.. ‘క్రీడాకారులు కేవలం ఆటలకే పరిమితం కాకుండా వారి భవిష్యత్తును తీర్చిదిద్దడంలో చురుకైన పాత్ర పోషించాలని నమ్ముతున్నాను. క్రీడాకారులు తమ సమస్యలను తెలియజేయడానికి ఒక వ్యవస్థను ఏర్పాటు చేయడం కోసం కృషి చేస్తాను. పురుషుల 25 మీటర్ల ర్యాపిడ్ ఫైర్ పిస్టల్ ఈవెంట్‌ను పరిరక్షించడం, ఒలింపిక్ కార్యక్రమంలో ఈ విభాగానికి భవిష్యత్తును సురక్షితం చేయడం నా టార్గెట్. ఒలింపిక్ సైకిల్స్ అంతటా సాంకేతిక నియమాల్లో మరింత స్థిరత్వం కోసం నేను కృషి చేస్తాను' అని మను భాకర్ పేర్కొంది.
దోహాలో జరుగుతున్నఐఎస్ఎస్ఎఫ్ ప్రపంచ ఛాంపియన్షిప్ పోటీల సందర్భంగా నవంబర్ 3 నుంచి నవంబర్ 13 వరకు ఈ ఎన్నికలు జరుగుతాయి. 18 ఏళ్లు నిండి ఈ ఛాంపియన్‌షిప్‌లో పాల్గొంటున్న అథ్లెట్లందరూ ఓటు వేయడానికి అర్హులు.
ఈ వార్తలనూ చదవండి:
పులివెందుల మున్సిపాలిటీ టీడీపీ కైవసం.. 13,875 ఓట్ల మెజారిటీతో భారీ గెలుపు
రూ.21,800 కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టిన ప్రధాని మోదీ
ఢిల్లీ వ్యాపార సంఘాల పిటిషన్‌పై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు