లక్ష్యం.. ఒలింపిక్ పతకం
ABN , Publish Date - Nov 01 , 2026 | 03:48 AM
మనీషా భన్వాలా భారత రెజ్లింగ్‌లో నయా సంచలనం. ప్రపంచ చాంపియన్‌షి్‌ప మహిళల 59 కిలోల విభాగంలో స్వర్ణ పతకం కొల్లగొట్టిన 29 ఏళ్ల ఈ హరియాణా యువతి దేశ రెజ్లింగ్‌లో...
ప్రపంచ విజేత మనీషా
ప్రపంచ టైటిల్ గెలిచాక తండ్రి ఫొటో ఉన్న టీషర్ట్‌తో మనీషా
న్యూఢిల్లీ: మనీషా భన్వాలా భారత రెజ్లింగ్‌లో నయా సంచలనం. ప్రపంచ చాంపియన్‌షి్‌ప మహిళల 59 కిలోల విభాగంలో స్వర్ణ పతకం కొల్లగొట్టిన 29 ఏళ్ల ఈ హరియాణా యువతి దేశ రెజ్లింగ్‌లో తనకంటూ ఓ పేజీ సృష్టించుకుంది. ఇటీవలి ఆసియా క్రీడల్లో పతక సాధనలో విఫలమైనా.. వరల్డ్ చాంపియన్‌షి్‌పలో ఏకంగా పసిడి పతకం నెగ్గి చరిత్ర సృష్టించింది. ప్రపంచ పోటీల స్వర్ణం ఇచ్చిన ఆత్మవిశ్వాసంతో ఉన్న మనీషా.. ఇక తన తదుపరి లక్ష్యం లాస్‌ఏంజిల్స్ ఒలింపిక్సే అంటోంది. అయితే ఆ విశ్వక్రీడల్లో 59 కిలోల కేటగిరీ లేకపోవడంతో 57 కిలోల విభాగంలో ఆమె తలపడాల్సి ఉంది. ఒలింపిక్స్‌లో కచ్చితంగా పతకం సాధిస్తానని ఆమె ధీమా వ్యక్తం చేసింది. ఇక, ప్రపంచ చాంపియన్‌షిప్ విజయాన్ని తన నాన్నకు అంకితమిస్తున్నట్టు మనీషా తెలిపింది. మనీషా ఈస్థాయికి ఎదిగేందుకు ఎన్నో త్యాగాలు చేసిన ఆమె తండ్రి సరేష్ భన్వాలా నాలుగేళ్ల క్రితం మరణించాడు.
ఇవి కూడా చదవండి:
భారత క్రికెట్ భవిష్యత్తుకు వైభవ్ మంచి పెట్టుబడి: సనత్ జయసూర్య
పాక్ విజయంపై పోస్ట్.. ఇంత బిల్డప్ అవసరమా అంటూ ప్రధాని షరీఫ్‌పై ట్రోల్స్!