Share News

కీస్‌ అవుట్‌

ABN , Publish Date - Jan 27 , 2026 | 06:20 AM

ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ రెండో వారం తొలిరోజు పలు సంచనాలు చోటు చేసుకున్నాయి. మహిళల డిఫెండింగ్‌ చాంపియన్‌ మాడిసన్‌ కీస్‌, పురుషుల్లో తొమ్మిదో సీడ్‌ టేలర్‌ ఫ్రిట్జ్‌, 12వ సీడ్‌...

కీస్‌ అవుట్‌

ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌

  • ఫ్రిట్జ్‌, రూడ్‌ కూడా..

  • క్వార్టర్‌ ఫైనల్లో పెగులా, సినర్‌, స్వియటెక్‌

మెల్‌బోర్న్‌: ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ రెండో వారం తొలిరోజు పలు సంచనాలు చోటు చేసుకున్నాయి. మహిళల డిఫెండింగ్‌ చాంపియన్‌ మాడిసన్‌ కీస్‌, పురుషుల్లో తొమ్మిదో సీడ్‌ టేలర్‌ ఫ్రిట్జ్‌, 12వ సీడ్‌ కాస్పెర్‌ రూడ్‌కు నాలుగో రౌండ్‌లో చుక్కెదురైంది. ఇక..రెండుసార్లు డిఫెండింగ్‌ చాంపియన్‌ యానిక్‌ సినర్‌ మెల్‌బోర్న్‌ పార్క్‌లో 18వ వరుస విజయం నమోదు చేశాడు. సోమవారం జరిగిన మహిళల సింగిల్స్‌ ప్రీ క్వార్టర్‌ఫైనల్లో అమెరికాకు చెందిన ఆరో సీడ్‌ జెస్సికా పెగులా 6-3, 6-4తో తన దేశానికే చెందిన గత ఏడాది విజేత, తొమ్మిదో సీడ్‌ మాడిసన్‌ కీస్‌కు షాకిచ్చింది. మరో మ్యాచ్‌లో రెండో సీడ్‌ స్వియటెక్‌ 6-0, 6-3తో ఇన్‌గ్లి్‌సను వరుస సెట్లలో చిత్తు చేసి క్వార్టర్‌ఫైనల్‌కు చేరింది. అనిసిమోవా 7-6 (4), 6-4తో వాంగ్‌ని, రిబకినా 6-3, 6-1తో 21వ సీడ్‌ మెర్టెన్స్‌ని ఓడించింది. సినర్‌ 6-1, 6-3, 7-6 (2)తో ఇటలీకే చెందిన 22వ సీడ్‌ డార్డెరీపై నెగ్గాడు. తద్వారా ఇటలీ స్టార్‌ వరుసగా తొమ్మిదోసారి గ్రాండ్‌స్లామ్‌లో క్వార్టర్‌ఫైనల్‌కు చేరాడు. ఎనిమిదో సీడ్‌ బెన్‌ షెల్టన్‌ 3-6, 6-4, 6-3, 6-4తో 12వ సీడ్‌ కాస్పెర్‌ రూడ్‌కి ఝలకిచ్చి క్వార్టర్స్‌లో అడుగుపెట్టాడు. ఐదో సీడ్‌ ముసేటి 6-2, 7-5, 6-4తో తొమ్మిదో సీడ్‌ టేలర్‌ ఫ్రిట్జ్‌ని కంగుతినిపించి క్వార్టర్‌ఫైనల్లో ప్రవేశించాడు. కాగా పురుషుల డబుల్స్‌లో యుకీ భాంబ్రీ ద్వయం ఓటమితో ఈ టోర్నీలో భారతపోరు ముగిసినట్టయింది.

ఇవి కూడా చదవండి:

మా వాళ్లతో జాగ్రత్త.. పాక్‌కు టీమిండియా మాజీ క్రికెటర్ వార్నింగ్

అరుదైన చెత్త రికార్డుతో కోహ్లీ సరసన చేరిన సంజూ

Updated Date - Jan 27 , 2026 | 06:20 AM