లోకేశ్ గోల్డెన్ జంప్
ABN , Publish Date - Mar 15 , 2026 | 06:11 AM
భారత్ యువ అథ్లెట్ లోకేశ్ సత్యనాథన్ తన అథ్లెటిక్ కెరీర్‌లో అతిపెద్ద విజయాన్ని అందుకున్నాడు. అమెరికాలోని అర్కాన్స్‌సలో జరిగిన ఎన్‌సీఏఏ ఇండోర్ ట్రాక్,...
న్యూఢిల్లీ: భారత్ యువ అథ్లెట్ లోకేశ్ సత్యనాథన్ తన అథ్లెటిక్ కెరీర్‌లో అతిపెద్ద విజయాన్ని అందుకున్నాడు. అమెరికాలోని అర్కాన్స్‌సలో జరిగిన ఎన్‌సీఏఏ ఇండోర్ ట్రాక్, ఫీల్డ్ చాంపియన్‌షి్‌ప పురుషుల లాంగ్‌జంప్ విభాగంలో అతడు స్వర్ణ పతకం చేజిక్కించుకున్నాడు. 8.21 మీ. దూరం లంఘించిన లోకేశ్ ఇండోర్ చాంపియన్‌షి్‌ప లాంగ్‌జం్‌పలో కొత్త జాతీయ రికార్డు నెలకొల్పాడు. ఈక్రమంలో భారత లాంగ్‌జంపర్ల ఆల్‌టైమ్ జాబితాలో జస్విన్ అల్ర్డిన్ (8.42మీ.), మురళీ శ్రీశంకర్ (8.41మీ) తర్వాత మూడో స్థానం సాధించాడు. కాగా..డి ఆండ్రే వార్డ్ (యూనివర్సిటీ ఆఫ్ సదరన్ మిస్సిసిపీ) 8.20 మీ. దూరంతో రజతం, తఫాజ్వా చికోంబ (కాన్సస్ యూనివర్సిటీ) 8.15 మీ. దూరంతో కాంస్య పతకం దక్కించుకున్నారు.
ఇవి కూడా చదవండి...
గ్యాస్ సరఫరాపై సీఎం చంద్రబాబు ఫోకస్.. మంత్రులతో చర్చ
కేంద్రమంత్రి అన్నపూర్ణా దేవితో మంత్రి సీతక్క భేటీ.. చర్చించిన అంశాలివే