అద్భుతం.. ఈ చిత్రం
ABN , Publish Date - Jul 19 , 2026 | 03:29 AM
మరి కొద్ది గంటల్లో అర్జెంటీనా-స్పెయిన్ జట్ల మధ్య వరల్డ్ కప్ ఫైనల్ జరగనుంది. ఈనేపథ్యంలో సోషల్‌మీడియాలో విపరీతంగా హల్‌చల్ చేస్తున్న ఓ ఫొటోపై...
న్యూజెర్సీ: మరి కొద్ది గంటల్లో అర్జెంటీనా-స్పెయిన్ జట్ల మధ్య వరల్డ్ కప్ ఫైనల్ జరగనుంది. ఈనేపథ్యంలో సోషల్‌మీడియాలో విపరీతంగా హల్‌చల్ చేస్తున్న ఓ ఫొటోపై అర్జెంటీనా కెప్టెన్ మెస్సీ ‘అద్భుతం’ అని స్పందించాడు. ఇంతకీ ఆ చిత్రం ఏమిటంటే.. ఓ చిన్న ప్లాస్టిక్ టబ్బులో ఓ పసిపిల్లాడికి ఓ యువకుడు స్నానం చేయిస్తుంటాడు. టబ్బులో ఉన్నది స్పెయిన్ జట్టు టీనేజ్ సంచనలం యామల్ అయితే, స్నానం చేయిస్తున్న యువకుడు మెస్సీ. ఎప్పుడో 20 ఏళ్ల కిందట యునెసెఫ్ చారిటీ క్యాలెండర్ కోసం ఎఫ్‌సీ బార్సిలోనా స్టేడియంలో ఆ ఫొటో తీశారు. అదే ఆ చిత్రం. ‘అది అద్భుతమైన ఫొటో. యామల్ పిల్లవాడిగా ఉన్నప్పుడు దిగింది. ఇప్పుడు నేను, యామల్ వరల్డ్ కప్‌లో ఆడుతుండడం నమ్మశక్యంగా లేదు’ అని మెస్సీ వ్యాఖ్యానించాడు.
ఇవి కూడా చదవండి:
ఇంగ్లండ్‌తో తుది వన్డేకు భారత్ సిద్ధం.. లార్డ్స్ గడ్డపై రికార్డు మారేనా?
'రక్తానికి రక్తం'.. ట్రంప్ కుటుంబమే లక్ష్యంగా ఇరాన్ భారీ బ్యానర్లు!