వరల్డ్‌కపలో మెస్సీ ఆడేనా?
ABN , Publish Date - May 27 , 2026 | 03:01 AM
మరో రెండు వారాల్లో ఫిఫా వరల్డ్‌కప్ ఆరంభం కానుండగా.. అర్జెంటీనా స్టార్ లియోనెల్ మెస్సీ గాయపడ్డాడనే వార్త సాకర్ అభిమానులను...
గాయంతో బాధపడుతున్న స్టార్
న్యూఢిల్లీ: మరో రెండు వారాల్లో ఫిఫా వరల్డ్‌కప్ ఆరంభం కానుండగా.. అర్జెంటీనా స్టార్ లియోనెల్ మెస్సీ గాయపడ్డాడనే వార్త సాకర్ అభిమానులను ఆందోళనకు గురిచేస్తోంది. మేజర్ లీగ్ సాకర్‌లో ఇంటర్ మయామికి మెస్సీ ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. ఫిలడెల్ఫియాతో మ్యాచ్‌లో ఆడుతున్న మెస్సీ ఒక్కసారిగా తొడ కండరాలు పట్టేయడంతో మైదానాన్ని వీడాడు. అయితే, కోలుకొనేందుకు ఎంత సమయం పడుతుందనే విషయం ప్రకటించలేదు. ఈ నేపథ్యంలో వరల్డ్‌క్‌పనకు మెస్సీ దూరమవుతాడనే ఊహాగానాలు కూడా వెలువడుతున్నాయి. కాగా, జూన్ 11 నుంచి సాకర్ మెగా సమరం జరగనుంది.
ఇవి కూడా చదవండి:
చెన్నై సూపర్ కింగ్స్‌లోకి ఊహించని ప్లేయర్!
కోహ్లీ-ట్రావిస్ మధ్య వివాదంలో మూడో వ్యక్తి!