Share News

పీలే రికార్డు సమం

ABN , Publish Date - Mar 03 , 2026 | 03:12 AM

ఫ్రీకిక్‌ గోల్స్‌లో బ్రెజిల్‌ సాకర్‌ లెజెండ్‌ పీలేను అర్జెంటీనా గ్రేట్‌ లియోనెల్‌ మెస్సీ సమం చేశాడు. మేజర్‌ లీగ్‌ సాకర్‌ టోర్నీలో ఓర్లాండో సిటీ జట్టుతో మ్యాచ్‌లో ఇంటర్‌ మయామి...

పీలే రికార్డు సమం

ఫ్లోరిడా: ఫ్రీకిక్‌ గోల్స్‌లో బ్రెజిల్‌ సాకర్‌ లెజెండ్‌ పీలేను అర్జెంటీనా గ్రేట్‌ లియోనెల్‌ మెస్సీ సమం చేశాడు. మేజర్‌ లీగ్‌ సాకర్‌ టోర్నీలో ఓర్లాండో సిటీ జట్టుతో మ్యాచ్‌లో ఇంటర్‌ మయామి ఆటగాడైన మెస్సీ సెకండా్‌ఫలో ఈ అద్భుత గోల్‌ నమోదు చేశాడు. ఈ క్రమంలో కెరీర్‌లో 70వ ఫ్రీకిక్‌ గోల్‌ను నమోదు చేసిన మెస్సీ.. పీలే రికార్డును సమం చేశాడు. దీంతో మయామి 4-2తో ఓర్లాండో సిటీపై గెలిచింది. ఓవరాల్‌గా 77 ఫ్రీకిక్‌ గోల్స్‌తో జునిన్హో (బ్రెజిల్‌) టాప్‌లో ఉండగా.. పీలే, మెస్సీ సంయుక్తంగా రెండో స్థానంలో నిలిచారు. కాగా, 900 గోల్స్‌ మైలురాయికి మెస్సీ (898) మరో రెండు గోల్స్‌ దూరంలో ఉన్నాడు.

ఇవి కూడా చదవండి:

విండీస్‌పై విజయం.. ‘ఇంపాక్ట్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ ఎవరంటే?

అతడి హార్డ్ వర్క్ వల్లే సాధ్యమైంది.. సంజుపై సూర్య ప్రశంసలు

Updated Date - Mar 03 , 2026 | 03:12 AM