Share News

వారెవ్వా..నొస్కోవా

ABN , Publish Date - Jul 12 , 2026 | 03:22 AM

ఇద్దరు చెక్‌ రిపబ్లిక్‌ భామల మధ్య జరిగిన పోరులో తొమ్మిదో సీడ్‌ లిండా నొస్కోవా విజేతగా నిలిచింది. వింబుల్డన్‌ కొత్త తారగా 21 ఏళ్ల నొస్కోవా అవతరించింది. శనివారం హోరాహోరీగా...

వారెవ్వా..నొస్కోవా

నేడు పురుషుల ఫైనల్‌

సినర్‌ X జ్వెరెవ్‌

రా. 8.30 నుంచి

స్టార్‌స్పోర్ట్స్‌లో..

వింబుల్డన్‌తో తొలి గ్రాండ్‌స్లామ్‌ సొంతంఫ ముచోవా ఓటమి

లండన్‌: ఇద్దరు చెక్‌ రిపబ్లిక్‌ భామల మధ్య జరిగిన పోరులో తొమ్మిదో సీడ్‌ లిండా నొస్కోవా విజేతగా నిలిచింది. వింబుల్డన్‌ కొత్త తారగా 21 ఏళ్ల నొస్కోవా అవతరించింది. శనివారం హోరాహోరీగా జరిగిన మహిళల సింగిల్స్‌ ఫైనల్స్‌లో నొస్కోవా 6-2, 5-7, 6-3తో 10 సీడ్‌ కరోలినా ముచోవాను చిత్తు చేసింది. కెరీర్‌లో తొలి గ్రాండ్‌స్లామ్‌ను ముద్దాడింది. రెండుసార్లు ముచోవా సర్వీ్‌స బ్రేక్‌ చేసిన నొస్కోవా తొలి సెట్‌ను అలవోకగా నెగ్గింది. కానీ రెండో సెట్‌లో పోరాడిన ముచోవా ఐదు చాంపియన్‌షి్‌ప పాయింట్లను కాపాడుకుంది. ప్రత్యర్థి సర్వీ్‌సను రెండుసార్లు బ్రేక్‌ చేసి సెట్‌ నెగ్గింది. దీంతో మ్యాచ్‌ మూడో సెట్‌కు మళ్లగా.. ఆ సెట్‌తో పాటు మ్యాచ్‌ను నెగ్గిన లిండా వింబుల్డన్‌ క్వీన్‌గా అవతరించింది.

ఇవీ చదవండి:

స్టోక్స్ రిటైర్మెంట్ వీడియోపై రచ్చ.. ఈసీబీకి ఐసీసీ క్లీన్‌ చిట్!

ఆ ఫొటోలు చూసి కోహ్లీ షాకైపోయాడు: ఇంగ్లండ్ బ్యాటర్ జార్డన్ కాక్స్

Updated Date - Jul 12 , 2026 | 03:22 AM