పసిడి పోరుకు లలిత్
ABN , Publish Date - Apr 07 , 2026 | 02:53 AM
ఆసియా రెజ్లింగ్ చాంపియన్‌షిప్‌లో భారత యువ ఆటగాడు లలిత్ పసిడి పోరులో నిలిచాడు. కిర్గిస్థాన్‌లోని బిష్కెక్‌లో...
ఆసియా రెజ్లింగ్
న్యూఢిల్లీ: ఆసియా రెజ్లింగ్ చాంపియన్‌షిప్‌లో భారత యువ ఆటగాడు లలిత్ పసిడి పోరులో నిలిచాడు. కిర్గిస్థాన్‌లోని బిష్కెక్‌లో సోమవారం జరిగిన 55 కిలోల గ్రీకో రోమన్ సెమీఫైనల్లో లలిత్ 11-3తో చైనా రెజ్లర్ హూయింగ్ షిని చిత్తు చేసి ఫైనల్‌కు దూసుకెళ్లాడు. టైటిల్ ఫైట్‌లో బొతిరోవ్ (ఉజ్బెకిస్థాన్)తో లలిత్ తలపడనున్నాడు. ఇక, గ్రీకో రోమన్ కేటగిరిలోనే అమన్ (77 కిలోలు), సునీల్ కుమార్ (87 కిలోలు) సెమీఫైనల్స్‌లో ఓడారు. దీంతో వీరిద్దరూ తమ విభాగాల్లో కాంస్యం కోసం పోటీపడనున్నారు.
ఇవి కూడా చదవండి:
అందుకే ఐపీఎల్‌కు రిటైర్‌మెంట్ ప్రకటించా.. అశ్విన్ సంచలన వ్యాఖ్యలు
ధోనికి ఫిట్‌నెస్ టెస్ట్.. ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్‌తో బరిలోకి దిగనున్న తలా!