Share News

లక్ష్యసేన్‌ సంచలనం

ABN , Publish Date - Mar 04 , 2026 | 01:41 AM

ఆల్‌ ఇంగ్లండ్‌లో భారత ఏస్‌ షట్లర్‌ లక్ష్యసేన్‌ సంచలనం సృష్టించాడు. తొలి రౌండ్‌లో డిఫెండింగ్‌ చాంపియన్‌, వరల్డ్‌ నెంబర్‌వన్‌ షి యు కి (చైనా)కు షాకిచ్చి ప్రీక్వార్టర్స్‌కు దూసుకెళ్లాడు...

లక్ష్యసేన్‌ సంచలనం

డిఫెండింగ్‌ చాంప్‌కు షాక్‌

గాయత్రి జోడీ పరాజయం

ఆల్‌ ఇంగ్లండ్‌ బ్యాడ్మింటన్‌

బర్మింగ్‌హామ్‌: ఆల్‌ ఇంగ్లండ్‌లో భారత ఏస్‌ షట్లర్‌ లక్ష్యసేన్‌ సంచలనం సృష్టించాడు. తొలి రౌండ్‌లో డిఫెండింగ్‌ చాంపియన్‌, వరల్డ్‌ నెంబర్‌వన్‌ షి యు కి (చైనా)కు షాకిచ్చి ప్రీక్వార్టర్స్‌కు దూసుకెళ్లాడు. మంగళవారం హోరాహోరీగా సాగిన మ్యాచ్‌లో లక్ష్యసేన్‌ 23-21, 19-21, 21-17తో టాప్‌సీడ్‌ షి యు కిపై పోరాడి నెగ్గాడు. కాగా, మహిళల సింగిల్స్‌ తొలి రౌండ్‌లో మాళవిక 11-21, 6-21తో మూడో సీడ్‌ చెన్‌ యు ఫి (చైనా) చేతిలో ఓడింది. మహిళల డబుల్స్‌లో భారత స్టార్‌ ద్వయం గాయత్రీ గోపీచంద్‌- ట్రీసా జాలీ 15-21, 21-15, 18-21తో జపాన్‌ జంట అయాకో సకురమోటో-హిరోటా చేతిలో ఓటమిపాలై తొలి రౌండ్లోనే వెనుదిరి గింది. కాగా.. మిక్స్‌డ్‌ డబుల్స్‌ ఆరంభ రౌండ్‌లో భారత జోడీ ధ్రువ్‌ కపిల-తనీషా 21-17, 21-19తో మలేసియా జంట ఓవర్‌ హు పాంగ్‌ రన్‌-చెన్‌ సు యున్‌పై గెలిచి ప్రీక్వార్టర్స్‌లో అడుగుపెట్టింది.

ఇవి కూడా చదవండి..

ఇరాన్ దిగి వచ్చింది.. కానీ ఇప్పటికే ఆలస్యమైంది: ట్రంప్

ఇరాన్ అధ్యక్ష కార్యాలయంపై దాడి.. ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ వెల్లడి

Updated Date - Mar 04 , 2026 | 01:41 AM