Share News

సెమీస్‌లో లక్ష్య, సాత్విక్‌ జోడీ

ABN , Publish Date - Nov 21 , 2026 | 05:54 AM

ఏస్‌ షట్లర్‌ లక్ష్యసేన్‌, డబుల్స్‌ జోడీ సాత్విక్‌/చిరాగ్‌ హాంకాంగ్‌ ఓపెన్‌ సూపర్‌ 500 బ్యాడ్మింటన్‌ టోర్నీ సెమీఫైనల్‌కు...

సెమీస్‌లో లక్ష్య, సాత్విక్‌ జోడీ

  • రక్షిత ఓటమి

  • హాంకాంగ్‌ ఓపెన్‌

కౌలూన్‌ (హాంకాంగ్‌): ఏస్‌ షట్లర్‌ లక్ష్యసేన్‌, డబుల్స్‌ జోడీ సాత్విక్‌/చిరాగ్‌ హాంకాంగ్‌ ఓపెన్‌ సూపర్‌ 500 బ్యాడ్మింటన్‌ టోర్నీ సెమీఫైనల్‌కు దూసుకెళ్లారు. కాగా, టీనేజర్‌ రక్షితా రామ్‌రాజ్‌ జోరుకు క్వార్టర్‌ఫైనల్లో బ్రేక్‌ పడింది. శుక్రవారం జరిగిన పురుషుల సింగిల్స్‌ క్వార్టర్‌ఫైనల్లో లక్ష్యసేన్‌ 21-17, 10-21, 21-13తో ఎనిమిదో సీడ్‌ లో కీన్‌ యీ (సింగపూర్‌)కు షాకిచ్చాడు. మహిళల సింగిల్స్‌లో..గత రౌండ్‌లో ఒలింపిక్‌ మాజీ చాంపియన్‌ చెన్‌ యూఫీని చిత్తు చేసిన రక్షిత క్వార్టర్‌ఫైనల్లో మాత్రం 19-21, 16-21తో థాయ్‌లాండ్‌కు చెందిన ఐదో సీడ్‌ పోర్న్‌పవీ చొచువాంగ్‌ చేతిలో పరాజయం చవిచూసింది. పురుషుల డబుల్స్‌ క్వార్టర్‌ఫైనల్లో ఐదో సీడ్‌ సాత్విక్‌/చిరాగ్‌ జోడీ 21-12, 13-21, 21-16తో హు కీ యువాన్‌/లిన్‌ షియాంగ్‌ (చైనా) జంటపై నెగ్గింది.

ఇవి కూడా చదవండి:

'అతిపెద్ద ద్రోహి'.. ఖవాజాపై సౌతాఫ్రికా మాజీ క్రికెటర్ డివిలియర్స్ ఆగ్రహం!

ధోని ఆటకు పాక్ అధ్యక్షుడు ముషారఫ్ ముగ్దులయ్యారు: శుక్లా

Updated Date - Nov 21 , 2026 | 05:54 AM