మరో టైటిల్‌పై తన్వీ గురి
ABN , Publish Date - Aug 04 , 2026 | 04:47 AM
థాయ్ ఓపెన్ తాజా చాంపియన్ తన్వీ శర్మ అదే జోరు కొనసాగించాలన్న పట్టుదలతో ఉండగా.. వెటరన్ కిడాంబి శ్రీకాంత్ మెరుగైన ప్రదర్శనకు..
నేటి నుంచి కొరియా ఓపెన్
కొరియా అసన్: థాయ్ ఓపెన్ తాజా చాంపియన్ తన్వీ శర్మ అదే జోరు కొనసాగించాలన్న పట్టుదలతో ఉండగా.. వెటరన్ కిడాంబి శ్రీకాంత్ మెరుగైన ప్రదర్శనకు సిద్ధమవుతున్నాడు. మంగళవారం నుంచి జరిగే కొరియా ఓపెన్‌లో తన్వీ టైటిలే లక్ష్యంగా బరిలోకి దిగనుంది. మహిళల సింగిల్స్ తొలి రౌండ్‌లో క్వాలిఫయర్‌తో తన్వీ తలపడనుంది. అస్మిత చలీహా, ఆకర్షి కశ్యప్, తన్య హేమంత్, అన్‌మోల్ కర్బ్, మాన్సీ జోషి, శ్రేయాన్షి బరిలోకి దిగనున్నారు. పురుషుల సింగిల్స్‌లో కిడాంబితోపాటు సనీత్, తరుణ్ మన్నెపల్లి, రోనక్, మిథున్ మంజునాథ తదితరులు పాల్గొననున్నారు. డబుల్స్‌లో కృష్ణ ప్రసాద్-పృథ్వీ, భార్గవ రామ్-యశ్‌తేజ్, శ్రుతి మిశ్రా-ప్రియ, సోనల్ సింగ్-రితిక ఠాకూర్, మిక్స్‌డ్‌లో ధ్రువ్-మనీషా, ఇషాన్ భట్నాగర్-శ్రుతి మిశ్రా, సాత్విక్-రాధిక శర్మ ఆడనున్నారు.
ఇవి కూడా చదవండి:
నీరజ్ చోప్రా సలహాతోనే మెడల్ వరించింది: కాంస్య విజేత యశ్‌వీర్ సింగ్
టీమిండియా మాజీ కోచ్ దిలీప్ భావోద్వేగభరితమైన లేఖ