Share News

‘ఆశ్రమ సందర్శనకు కోహ్లీ డబ్బు తీసుకోలేదు’

ABN , Publish Date - Oct 08 , 2026 | 05:25 AM

Was Kohli paid ₹5 crore? Virat's team responds. Virat Kohli Denies Rs 5 Crore Payment Claim Over Vrindavan Ashram Visit

‘ఆశ్రమ సందర్శనకు కోహ్లీ డబ్బు తీసుకోలేదు’

న్యూఢిల్లీ: టీమిండియా స్టార్‌ విరాట్‌ కోహ్లీ, అనుష్క శర్మ దంపతులు ఉత్తరప్రదేశ్‌ బృందావన్‌లోని ఆధ్యాత్మిక వేత్త ప్రేమానంద్‌ మహారాజ్‌ ఆశ్రమాన్ని తరచుగా సందర్శిస్తుంటారు. అయితే, ఆశ్రమానికి ప్రజాదరణ పెంచుకునే క్రమంలో కోహ్లీ 2023లో ఆశ్రమానికి వచ్చినందుకు అతనికి రూ. 5 కోట్లు చెల్లించారని ఇటీవల శ్రీకృష్ణ జన్మభూమి సంఘర్ష్‌ న్యాస్‌ అధ్యక్షుడు ఫలహరి మహరాజ్‌ దినేశ్‌ శర్మ ఆరోపించారు. దీనిపై కోహ్లీ టీమ్‌ స్పందిస్తూ.. ఈ ఆరోపణలు నిరాధారమైనవని ఓ ప్రకటనలో పేర్కొంది. ‘పరువుకు భంగం కలిగించే ఆరోపణలు ఇవి. కోహ్లీ, అనుష్క వాళ్ల సొంత విశ్వాసం, భక్తితోనే ప్రేమానంద్‌ దర్శనం కోసం బృందావన్‌ వెళ్తుంటారు. ఈ వదంతులు వ్యాప్తి చేస్తున్నవారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం’ అని ఆ ప్రకటనలో విరాట్‌ ప్రతినిధి తెలిపారు.

ఇవి కూడా చదవండి:

ఇకపై సెలక్షన్ కమిటీ భేటీలకు వీవీఎస్ లక్ష్మణ్: బీసీసీఐ

తీవ్ర విషాదం.. విషవాయువు పీల్చి నలుగురు విద్యార్థుల మృతి

Updated Date - Oct 08 , 2026 | 05:25 AM