‘ఖేలో ఇండియా’కు తెలంగాణ ఆతిథ్యం
ABN , Publish Date - Jul 09 , 2026 | 02:23 AM
ఈ ఏడాది ఖేలో ఇండియా యూత్ గేమ్స్‌కు తెలంగాణ ఆతిథ్యమివ్వనుంది. ఈ విషయాన్ని కేంద్ర క్రీడాశాఖ మంత్రి మన్‌సుఖ్ మాండవీయ తెలిపారు...
న్యూఢిల్లీ: ఈ ఏడాది ఖేలో ఇండియా యూత్ గేమ్స్‌కు తెలంగాణ ఆతిథ్యమివ్వనుంది. ఈ విషయాన్ని కేంద్ర క్రీడాశాఖ మంత్రి మన్‌సుఖ్ మాండవీయ తెలిపారు. జాతీయ క్రీడా పోటీలను దేశం మొత్తం విస్తరించాలన్న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆలోచన మేరకు ఈ నిర్ణయం తీసుకున్నామని పేర్కొన్నారు. జపాన్‌లో జరిగే ఆసియా క్రీడల అనంతరం నవంబరులో ఖేలో ఇండియా పోటీలను నిర్వహిస్తామన్నారు. ఆతిథ్య రాష్ట్రంగా తమను ఎంపిక చేసినందుకు ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి మాండవీయకు తెలంగాణ క్రీడల మంత్రి వాకిటి శ్రీహరి కృతజ్ఞతలు తెలిపారు.
ఇవీ చదవండి:
ఎన్నికల విజయంపై న్యాయపోరు.. సీఎం విజయ్‌కు కొత్త చిక్కులు
ఢిల్లీ నుంచి సిలిగురికి 6 గంటల్లో.. పట్టాలెక్కిన బుల్లెట్ రైల్ ప్లాన్