Share News

సురేఖ కాంస్యం.. రజతమైంది

ABN , Publish Date - Jul 07 , 2026 | 05:49 AM

స్టార్‌ ఆర్చర్‌, విజయవాడ అమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ గతేడాది ఆర్చరీ ప్రపంచక్‌పలో సాధించిన కాంస్యం....

సురేఖ కాంస్యం.. రజతమైంది

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి క్రీడాప్రతినిధి): స్టార్‌ ఆర్చర్‌, విజయవాడ అమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ గతేడాది ఆర్చరీ ప్రపంచక్‌పలో సాధించిన కాంస్యం.. ఇప్పుడు రజత పతకానికి అప్‌గ్రేడ్‌ అయింది. వివరాల్లోకెళితే.. చైనా వేదికగా 2015లో జరిగిన ఆర్చరీ వరల్డ్‌కప్‌లో వ్యక్తిగత కాంపౌండ్‌ విభాగం ఫైనల్లో సురేఖ తృతీయ స్థానంలో నిలిచి కాంస్యంతో సరిపెట్టుకుంది. ఈ పోటీల్లో రన్నర్‌పగా నిలిచి, రజతం దక్కించుకున్న మెక్సికో ఆర్చర్‌ మరీనా బెర్నాల్‌.. డోపింగ్‌ నిరోధక నిబంధనలను ఉల్లంఘించిందన్న కారణంతో తాజాగా ఆమె పతకాన్ని రద్దు చేశారు. దీంతో మూడో స్థానంలో నిలిచిన జ్యోతికి రజత పతకం దక్కగా, నాలుగో స్థానంలో నిలిచిన ఎల్లా గిబ్సన్‌ (గ్రేట్‌ బ్రిటన్‌)కు కాంస్యం లభించింది. ఆండ్రియా బెసెరా (మెక్సికో) పసిడి పతకంలో మాత్రం మార్పు లేదు.

ఇవి కూడా చదవండి:

వైభవ్ అరంగేట్రంలో జాప్యంపై స్పందించిన బీసీసీఐ

ట్రంప్‌ జోక్యంపై యూరోపియన్ ఫుట్‌బాల్ సంఘం తీవ్ర విమర్శలు

Updated Date - Jul 07 , 2026 | 05:49 AM