Share News

ఫైనల్లో సురేఖ త్రయం

ABN , Publish Date - Jul 09 , 2026 | 02:40 AM

ఆర్చరీ ప్రపంచకప్‌ స్టేజ్‌-4 కాంపౌండ్‌ టీమ్‌ ఈవెంట్‌లో తెలుగు ఆర్చర్లు జ్యోతి సురేఖ, తానిపర్తి చికితరావు...

ఫైనల్లో సురేఖ త్రయం

ఆర్చరీ ప్రపంచ కప్‌ స్టేజ్‌-4

మాడ్రిడ్‌ (స్పెయిన్‌): ఆర్చరీ ప్రపంచకప్‌ స్టేజ్‌-4 కాంపౌండ్‌ టీమ్‌ ఈవెంట్‌లో తెలుగు ఆర్చర్లు జ్యోతి సురేఖ, తానిపర్తి చికితరావు, మహారాష్ట్ర అమ్మాయి ప్రీతికా ప్రదీప్‌లతో కూడిన భారత త్రయం ఫైనల్లో ప్రవేశించి కనీసం రజత పతకం ఖాయం చేసింది. బుధవారం జరిగిన సెమీఫైనల్లో సురేఖ బృందం 231-228తో కొరియాకు చెందిన కాంగ్‌ యియన్‌సియో, పార్క్‌ యిరిన్‌, పార్క్‌ జంగ్‌యున్‌ త్రయంపై నెగ్గింది. ఈనెల 11న జరిగే స్వర్ణ పతక పోరులో కొలంబియా త్రయంతో సురేఖ జట్టు అమీతుమీ తేల్చుకోనుంది.

ఇవి కూడా చదవండి:

ఐసీసీ ఎన్నికల్లో పెను సంచలనం.. డిప్యూటీ ఛైర్మన్ ఇమ్రాన్ ఖ్వాజాకు షాక్!

అక్తర్ రికార్డును బ్రేక్ చేస్తాను.. టీమిండియా బౌలర్ ఆసక్తికర వ్యాఖ్యలు

Updated Date - Jul 09 , 2026 | 02:40 AM