Share News

వరుసగా నాలుగోసారి..

ABN , Publish Date - Sep 12 , 2026 | 06:25 AM

డిఫెండింగ్‌ చాంపియన్‌ హోదాలో బరిలోకి దిగిన భారత కుర్రాళ్లు జూనియర్‌ ఆసియా హాకీ కప్‌లో టైటిల్‌...

వరుసగా నాలుగోసారి..

ఫైనల్‌కు మన కుర్రాళ్లు

  • మలేసియాపై భారత్‌ గెలుపు

  • జూనియర్‌ ఆసియా కప్‌ హాకీ

మోకి (చైనా): డిఫెండింగ్‌ చాంపియన్‌ హోదాలో బరిలోకి దిగిన భారత కుర్రాళ్లు జూనియర్‌ ఆసియా హాకీ కప్‌లో టైటిల్‌ నిలబెట్టుకునేందుకు అడుగు దూరంలో నిలిచారు. టోర్నీ ఆరంభం నుంచి దూకుడుగా చెలరేగుతున్న మనోళ్లు సెమీఫైనల్లోనూ అంతేదీటుగా విజృంభించారు. శుక్రవారం జరిగిన పోరులో 3-1తో మలేసియాను చిత్తుచేసి వరుసగా నాలుగోసారి ఫైనల్‌కు దూసుకెళ్లారు. భారత జట్టులో కెప్టెన్‌ అన్మోల్‌ ఎక్కా (16వ నిమిషం, 54వ) రెండు గోల్స్‌ కొట్టి జట్టు గెలుపులో కీలకపాత్ర పోషించాడు. మరో గోల్‌ను సుఖ్విందర్‌ (51వ) చేశాడు. మలేసియా తరఫున ఏకైక గోల్‌ను ఎమ్‌ రౌల్‌ (60వ) సాధించాడు. దక్షిణ కొరియాతో భారత్‌ టైటిల్‌ పోరులో తలపడనుంది. మరో సెమీఫైనల్లో కొరియా 4-1తో పాకిస్థాన్‌ను కంగుతినిపించింది.

ఈ వార్తలు కూడా చదవండి

ఆర్‌డబ్ల్యూఎస్‌ కాంట్రాక్టర్లకు గుడ్ న్యూస్.. రూ.620 కోట్లు విడుదల చేసిన కూటమి ప్రభుత్వం..

2027 నాటికి వందశాతం అక్షరాస్యతే లక్ష్యం.. కలెక్టర్లకు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం

Updated Date - Sep 12 , 2026 | 06:25 AM