Share News

ఫోన్సిక జోరు

ABN , Publish Date - Jun 02 , 2026 | 03:01 AM

బ్రెజిల్‌ టీనేజర్‌ యావో ఫోన్సిక ఫ్రెంచ్‌ ఓపెన్‌లో జోరు కొనసాగిస్తున్నాడు. మూడో రౌండ్‌లో జొకోవిచ్‌కు షాకిచ్చిన ఫోన్సిక ప్రీక్వార్టర్‌ఫైనల్లో రొలాండ్‌ గారోస్‌ మాజీ ఫైనలిస్ట్‌ రూడ్‌ను...

ఫోన్సిక జోరు

  • మాజీ ఫైనలిస్ట్‌ రూడ్‌కు ఝలక్‌

  • ఫ్రెంచ్‌ ఓపెన్‌

పారిస్‌: బ్రెజిల్‌ టీనేజర్‌ యావో ఫోన్సిక ఫ్రెంచ్‌ ఓపెన్‌లో జోరు కొనసాగిస్తున్నాడు. మూడో రౌండ్‌లో జొకోవిచ్‌కు షాకిచ్చిన ఫోన్సిక ప్రీక్వార్టర్‌ఫైనల్లో రొలాండ్‌ గారోస్‌ మాజీ ఫైనలిస్ట్‌ రూడ్‌ను తిరుగుముఖం పట్టించాడు. సోమవారం జరిగి నాలుగో రౌండ్‌లో ఫోన్సిక 7-5, 7-6 (8), 5-7, 6-2తో 15వ సీడ్‌ రూడ్‌ (నార్వే)కు ఝలకిచ్చాడు. అంతేకాదు ఈసారి టోర్నీ పురుషుల సింగిల్స్‌ బరిలో నిలిచిన పిన్నవయస్సు ఆటగాడిగా ఫోన్సిక (19)ఘనత దక్కించుకున్నాడు. ఇతర ప్రీక్వార్టర్‌ఫైనల్స్‌లో నాలుగోసీడ్‌ అలియాసిమె 6-3, 7-5, 6-1తో తబిలోపై విజయం సాధించాడు. కొబోలీ 6-2, 6-3, 6-7 (7), 7-6 (5)తో వాజ్డాపై నెగ్గాడు. కాగా మహిళల్లో ష్నేడిర్‌ 6-3, 3-6, 6-0తో మాడిసన్‌ కీస్‌కు చెక్‌పెట్టింది. ఇక కలిన్‌స్కియా చేతిలో 4-6, 6-2, 6-7 (10)తో ఓటమితో పొటపోవా టోర్నీనుంచి నిష్క్రమించింది.

క్వార్టర్‌ఫైనల్లో బాలాజీ: భారత్‌కు చెందిన శ్రీరామ్‌ బాలాజీ పురుషుల డబుల్స్‌ క్వార్టర్‌ఫైనల్‌కు దూసుకుపోయాడు. మూడో రౌండ్‌లో బాలాజీ/మార్లిసో డిమోలినెర్‌ (బ్రెజిల్‌) జంట 7-5, 6-4తో ఆరోసీడ్‌ జర్మన్‌ జోడీ పుట్జ్‌/కెవిన్‌పై గెలుపొందింది.

ఇవి కూడా చదవండి...

ఆవులపై ద్వంద్వ ప్రమాణాలు మానండి.. యోగి స్ట్రాంగ్ కౌంటర్

చిక్కుల్లో ఒమర్ అబ్దుల్లా ప్రభుత్వం..! ఎమ్మెల్యేలతో 3న అత్యవసర సమావేశం

Updated Date - Jun 02 , 2026 | 03:01 AM