Share News

జెమీమా అదుర్స్‌

ABN , Publish Date - Jan 21 , 2026 | 01:38 AM

ఢిల్లీ క్యాపిటల్స్‌ కెప్టెన్‌ జెమీమా రోడ్రి గ్స్‌ (37 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్‌తో 51 నాటౌట్‌) అజేయ అర్ధసెంచరీతో రా ణించింది. దీంతో మంగళవారం ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో...

జెమీమా అదుర్స్‌

మహిళల ప్రీమియర్‌ లీగ్‌

ముంబైపై ఢిల్లీ విజయం

వడోదర: ఢిల్లీ క్యాపిటల్స్‌ కెప్టెన్‌ జెమీమా రోడ్రి గ్స్‌ (37 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్‌తో 51 నాటౌట్‌) అజేయ అర్ధసెంచరీతో రా ణించింది. దీంతో మంగళవారం ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో డీసీ 7 వికెట్ల తేడాతో నెగ్గింది. అటు ముంబైకిది హ్యాట్రిక్‌ ఓటమి కావడం గమనార్హం. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ముంబై 20 ఓవర్లలో 5 వికెట్లకు 154 పరుగులు చేసింది. నాట్‌ సివర్‌ బ్రంట్‌ (65 నాటౌట్‌), కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ (41) మాత్రమే రాణించారు. ఆరంభంలో ఢిల్లీ బౌలర్ల ధాటికి పవర్‌ప్లేలో ముంబై 23/2 పరుగులతో కష్టాల్లో పడింది. ఈ దశలో సివర్‌-హర్మన్‌ జోడీ మూడో వికెట్‌కు 78 పరుగుల భాగస్వామ్యం సమకూర్చింది. శ్రీచరణికి మూడు వికెట్లు దక్కాయి. ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌గా జెమీమా నిలిచింది. ఓ మాదిరి ఛేదనలో ఢిల్లీ 19 ఓవర్లలో 3 వికెట్లకు 155 పరుగులు చేసి గెలిచింది. ఓపెనర్లు లీ (46), షఫాలీ (29) వేగంగా ఆడి తొలి వికెట్‌కు 63 పరుగులతో శుభారంభం అందించారు. అయితే వీరి నిష్క్రమణతో ఆట కాస్త నెమ్మదించినా.. కెప్టెన్‌ జెమీమా పోరాడింది. 36 బంతుల్లో అజేయ అర్ధసెంచరీ చేసిన తనకు వోల్వార్ట్‌ (17), కాప్‌ (10 నాటౌట్‌) సహకరించారు. దీంతో మరో ఓవర్‌ ఉండగానే ఢిల్లీ విజయం అందుకుంది.

సంక్షిప్త స్కోర్లు :

ముంబై: 20 ఓవర్లలో 154/5 (సివర్‌ 65 నాటౌట్‌, హర్మన్‌ 41; శ్రీచరణి 3/33);

ఢిల్లీ: 19 ఓవర్లలో 155/3. (జెమీమా 51 నాటౌట్‌, లీ 46, షఫాలీ 29; వైష్ణవి 1/20).

ఇవి కూడా చదవండి:

రో- కోకు డిమోషన్.. సెంట్రల్ కాంట్రాక్టుల్లో ‘బి గ్రేడ్’?

సమీపిస్తోన్న టీ20 ప్రపంచ కప్‌.. వివాదంలో రింకూ సింగ్!

Updated Date - Jan 21 , 2026 | 05:53 AM