Share News

తొమ్మిదేళ్ల క్రితమే బుమ్రా అద్భుతం చేశాడు.. 2017లో జస్ప్రీత్ చివరి ఓవర్ చూడండి..

ABN , Publish Date - Mar 11 , 2026 | 12:46 PM

జస్ప్రీత్ బుమ్రా లాంటి బౌలర్ ఉండడం ఏ జట్టుకైనా వరం. వికెట్లు తీయాల్సి వచ్చినా, పరుగులు నియంత్రించాల్సి వచ్చినా, కెప్టెన్‌గా ఎవరున్నా, బుమ్రా చేతికి బంతినివ్వాల్సిందే. భారతదేశం వరుసగా రెండోసారి టీ20 ప్రపంచ కప్ సాధించడంలో బుమ్రా కీలక పాత్ర పోషించాడు.

తొమ్మిదేళ్ల క్రితమే బుమ్రా అద్భుతం చేశాడు.. 2017లో జస్ప్రీత్ చివరి ఓవర్ చూడండి..
Jasprit Bumrah viral over

జస్ప్రీత్ బుమ్రా లాంటి బౌలర్ ఉండడం ఏ జట్టుకైనా వరం. వికెట్లు తీయాల్సి వచ్చినా, పరుగులు నియంత్రించాల్సి వచ్చినా, కెప్టెన్‌గా ఎవరున్నా, బుమ్రా చేతికి బంతినివ్వాల్సిందే. భారతదేశం వరుసగా రెండోసారి టీ20 ప్రపంచ కప్ సాధించడంలో బుమ్రా కీలక పాత్ర పోషించాడు. తాజా టీ20 టోర్నీలో అత్యధిక వికెట్లు తీసిన ఇద్దరు బౌలర్లలో ఒకడిగా నిలిచాడు. ఎనిమిది మ్యాచ్‌ల్లో 6.21 ఎకానమీతో 14 వికెట్లు పడగొట్టాడు. ఫైనల్ మ్యాచ్‌లో బుమ్రా నాలుగు వికెట్లు పడగొట్టి, కివీస్‌ను 159 పరుగులకే పరిమితం చేయడంలో కీలక పాత్ర పోషించాడు (Jasprit Bumrah viral over).


అంతకు ముందు ఇంగ్లండ్‌తో జరిగిన హై స్కోరింగ్ సెమీ ఫైనల్ మ్యాచ్‌లో బుమ్రా వేసిన బౌలింగ్ కీలకంగా మారింది. ఇరు జట్ల బౌలర్లు భారీగా పరుగులు సమర్పించుకున్నప్పటికీ, బుమ్రా మాత్రమే పొదుపుగా బౌలింగ్ చేసి టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఈ నేపథ్యంలో బుమ్రా గతంలో వేసిన ఓ అద్భుత ఓవర్‌కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. 2017లో ఇంగ్లండ్‌తో నాగ్‌పూర్‌లో ఆ మ్యాచ్ జరిగింది.


తొమ్మిదేళ్ల క్రితం నాగ్‌పూర్‌లో భారత్, ఇంగ్లండ్ మధ్య జరిగిన టీ20 మ్యాచ్‌ చివరి ఓవర్‌ను కూడా బుమ్రా అద్భుతంగా బౌలింగ్ చేశాడు. ఆ మ్యాచ్ లో 23 ఏళ్ల బుమ్రా చివరి ఓవర్‌ వేసి కేవలం 8 పరుగులను డిఫెండ్ చేసుకున్నాడు. జో రూట్, జాస్ బట్లర్ వంటి స్టార్ బ్యాటర్లు చివరి ఓవర్లో బుమ్రాను ఎదుర్కొని 8 పరుగులు చేయలేకపోయారు (Bumrah last over video) బుమ్రా బౌలింగ్ కారణంగానే టీమిండియా ఆ మ్యాచ్‌లో 144 పరుగులను డిఫెండ్ చేసుకుని గెలిచింది.


చివరి ఓవర్ తొలి బంతికే రూట్‌ను ఔట్ చేసిన బుమ్రా, నాలుగో బంతికి బట్లర్‌ను బౌల్డ్ చేశాడు (Bumrah bowling magic). ఆ సమయంలో బుమ్రా బౌలింగ్‌ను సరిగ్గా అర్థం చేసుకోలేకపోయిన ఇంగ్లండ్ బ్యాటర్లు 144 పరుగులను ఛేజింగ్ చేయలేకపోయారు. 2017లో జరిగిన ఈ మ్యాచ్‌కు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వయసు పెరుగుతున్నప్పటికీ బుమ్రా బౌలింగ్‌లో పదును తగ్గలేదని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.


ఇవి కూడా చదవండి..

ఇరాన్‌లో నల్లటి వర్షం.. ఇది ఎంత ప్రమాదకరమంటే..


బంగారం, వెండి ధరల్లో స్వల్ప పెరుగుదల.. ఈ రోజు ఎలా ఉన్నాయంటే..

Updated Date - Mar 11 , 2026 | 12:46 PM