Share News

సినర్‌ మళ్లీ విన్నర్‌

ABN , Publish Date - Jul 13 , 2026 | 05:14 AM

డిఫెండింగ్‌ చాంపియన్‌ యానిక్‌ సినర్‌ వరుసగా రెండో ఏడాది వింబుల్డన్‌ కిరీటాన్ని సొంతం చేసుకున్నాడు. ఆదివారం జరిగిన హోరాహోరీ ఫైనల్లో వరల్డ్‌ నెంబర్‌ వన్‌ సినర్‌...

సినర్‌ మళ్లీ విన్నర్‌

ఇటలీ స్టార్‌దే వింబుల్డన్‌ ట్రోఫీ

ఫైనల్లో జ్వెరెవ్‌ పరాజయం

లండన్‌: డిఫెండింగ్‌ చాంపియన్‌ యానిక్‌ సినర్‌ వరుసగా రెండో ఏడాది వింబుల్డన్‌ కిరీటాన్ని సొంతం చేసుకున్నాడు. ఆదివారం జరిగిన హోరాహోరీ ఫైనల్లో వరల్డ్‌ నెంబర్‌ వన్‌ సినర్‌ 6-7 (9), 7-6 (2), 6-3, 6-4తో రెండో సీడ్‌ అలెగ్జాండర్‌ జ్వెరెవ్‌ (జర్మనీ)ని ఓడించాడు. ఓవరాల్‌గా సినర్‌కిది ఐదో గ్రాండ్‌స్లామ్‌ టైటిల్‌ కావడం విశేషం. గతంలో రెండుసార్లు ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ (2024, 25), యూఎస్‌ ఓపెన్‌ (2024), ఇప్పుడు రెండో వింబుల్డన్‌ నెగ్గాడు.

ఆదిలో కష్టంగా..: తొలి సెట్‌లో ఇరువురు హోరాహోరీగా తలపడడంతో..అటు సినర్‌ ఇటు జ్వెరెవ్‌ సర్వీ్‌సలను బ్రేక్‌ చేయలేకపోయారు. దాంతో సెట్‌ టైబ్రేక్‌కు మళ్లింది. టై బ్రేక్‌లోనూ ఇద్దరు తగ్గేదేలే అనేలా ఆడారు. దాంతో టైబ్రేక్‌ రసవత్తరంగా సాగినా..చివరకు కళ్లు చెదిరే విన్నర్‌తో కీలక పాయింట్‌ రాబట్టిన జ్వెరెవ్‌ సెట్‌ను సొంతం చేసుకున్నాడు. దరిమిలా సినర్‌ చేతిలో 14 వరుస సెట్ల పరాజయాల తర్వాత.. జ్వెరెవ్‌కు తొలి సెట్‌ విజయం లభించింది. రెండో సెట్‌లోనూ అదే తీరు. సినర్‌, జ్వెరెవ్‌ సర్వీ్‌సలు నిలబెట్టుకుంటూ వెళ్లడంతో ఈ సెట్‌కూడా టైబ్రేక్‌కు చేరింది. టైబ్రేక్‌లో వరుసగా నాలుగు పాయింట్లు దక్కించుకున్న సినర్‌ అదే జోరులో రెండో సెట్‌ను కైవసం చేసుకున్నాడు. మూడో సెట్‌ ఎనిమిదో గేమ్‌లో జ్వెరెవ్‌ సర్వీస్‌ బ్రేక్‌ చేసిన సినర్‌ అదే ఊపులో సెట్‌ చేజిక్కించుకున్నాడు. ఇక నాలుగో సెట్‌లో ఏడో గేమ్‌లో మరోసారి ప్రత్యర్థి సర్వీస్‌ను బ్రేక్‌ చేసిన సినర్‌..ఆపై సెట్‌తో పాటు మ్యాచ్‌ను సొంతం చేసుకొనేందుకు ఎంతోసేపు పట్టలేదు.

క్రిస్టీనా జంటదే డబుల్స్‌ కిరీటం: ఫ్రాన్స్‌ స్టార్‌ క్రీడాకారిణి క్రిస్టీనా మ్లాదెనోవిక్‌, చైనా సంచలనం గువో హాన్యు జోడీ వింబుల్డన్‌ మహిళల డబుల్స్‌ చాంపియన్‌గా అవతరించింది. ఆదివారం ఇక్కడ జరిగిన ఫైనల్లో క్రిస్టీనా/హాన్యు జంట 6-3, 7-5తో గాబ్రియెలా డబ్రోస్కీ (కెనడా)/లూసా స్టెఫానీ (బ్రెజిల్‌) ద్వయాన్ని ఓడించి ట్రోఫీ అందుకుంది.

ఇవి కూడా చదవండి:

నాతో మర్యాదగా మాట్లాడండి.. రిఫరీతో మెస్సి వాగ్వాదం!

భారత్ వరుస ఓటములు.. కోచింగ్ స్టాఫ్‌లో కీలక మార్పులు!

Updated Date - Jul 13 , 2026 | 05:14 AM