Share News

జైపాల్‌ సూపర్‌

ABN , Publish Date - Nov 06 , 2026 | 06:53 AM

ప్రపంచ చాంపియన్‌షి్‌పలో భారత షూటర్‌ జైపాల్‌ మాలవీయ అద్భుత ప్రదర్శన చేశాడు. పురుషుల 10 మీటర్ల ఎయిర్‌ పిస్టల్‌ వ్యక్తిగ...

జైపాల్‌ సూపర్‌

  • రజతంతో పాటు ఒలింపిక్‌ కోటా సొంతం

  • మనూ భాకర్‌ బృందానికి పతకం

  • షూటింగ్‌ ప్రపంచ చాంపియన్‌షిప్‌

దోహా: ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో భారత షూటర్‌ జైపాల్‌ మాలవీయ అద్భుత ప్రదర్శన చేశాడు. పురుషుల 10 మీటర్ల ఎయిర్‌ పిస్టల్‌ వ్యక్తిగత ఈవెంట్‌లో రజతం సాధించాడు. జైపాల్‌ పతక ప్రదర్శనతో 2028 లాస్‌ ఏంజెల్స్‌ ఒలింపిక్స్‌ షూటింగ్‌లో భారత్‌కు తొలి కోటా దక్కింది. గురువారం జరిగిన ఫైనల్స్‌లో జైపాల్‌ 242.2 పాయింట్లు స్కోరు చేసి రెండోస్థానంలో నిలిచాడు. చైనా షూటర్‌ హు కాయ్‌ (243.9) స్వర్ణం, జిండ్రిచ్‌ దుబోవి (చెక్‌ రిపబ్లిక్‌) కాంస్యం నెగ్గారు. కాగా, మహిళల 10 మీటర్ల ఎయిర్‌ పిస్టల్‌ టీమ్‌ ఈవెంట్‌లో మనూ భాకర్‌, సురుచి సింగ్‌, సైన్యమ్‌లతో కూడిన భారత జట్టు రెండోస్థానంలో నిలిచి రజతం అందుకుంది.

ఈ వార్తలు కూడా చదవండి

లాస్ ఏంజెలెస్ సిటీ అటార్నీగా భారత సంతతి మహిళ..

పొత్తు లేకపోతే అన్ని స్థానాల్లో పోటీ చేస్తాము: చిరాగ్ పాశ్వాన్‌

Updated Date - Nov 06 , 2026 | 06:53 AM