కిమిదే ఇటాలియన్ గ్రాండ్ ప్రీ
ABN , Publish Date - Sep 07 , 2026 | 01:32 AM
ఫార్ములావన్ యువ కెరటం కిమి ఆంటోనెల్లి సొంతగడ్డపై సత్తా చాటాడు. ఈ మెర్సిడెస్ రేసర్ ఇటాలియన్ గ్రాండ్ ప్రీలో చాంపియన్‌గా నిలిచాడు. ఆదివారం జరిగిన ఫైనల్ రేసును 20 ఏళ్ల కిమి అగ్రస్థానంతో ముగించాడు.
మోంజా (ఇటలీ): ఫార్ములావన్ యువ కెరటం కిమి ఆంటోనెల్లి సొంతగడ్డపై సత్తా చాటాడు. ఈ మెర్సిడెస్ రేసర్ ఇటాలియన్ గ్రాండ్ ప్రీలో చాంపియన్‌గా నిలిచాడు. ఆదివారం జరిగిన ఫైనల్ రేసును 20 ఏళ్ల కిమి అగ్రస్థానంతో ముగించాడు. దీంతో 1966లో లుడోవికో స్కార్‌ఫియోటి తర్వాత స్వదేశంలో రేస్ నెగ్గిన ఇటలీ ఆటగాడిగా కిమి రికార్డుకెక్కాడు. మెర్సిడె్‌సకే చెందిన రస్సెల్ రెండు, వెర్‌స్టాపెన్ (రెడ్‌బుల్) మూడోస్థానంలో నిలిచి పోడియం ఫినిష్ చేశారు.
ఈ వార్తలను కూడా చదవండి