Share News

గురి తప్పని ఇషా

ABN , Publish Date - Feb 10 , 2026 | 02:36 AM

ఆసియా షూటింగ్‌ చాంపియన్‌షి్‌పను హైదరాబాద్‌ షూటర్‌ ఇషా సింగ్‌ నాలుగు పతకాలతో ముగించింది. సోమవారం జరిగిన 25 మీటర్ల స్టాండర్డ్‌ పిస్టల్‌...

గురి తప్పని ఇషా

ఆసియా చాంపియన్‌షి్‌పలో మరో స్వర్ణం, కాంస్యం

న్యూఢిల్లీ: ఆసియా షూటింగ్‌ చాంపియన్‌షి్‌పను హైదరాబాద్‌ షూటర్‌ ఇషా సింగ్‌ నాలుగు పతకాలతో ముగించింది. సోమవారం జరిగిన 25 మీటర్ల స్టాండర్డ్‌ పిస్టల్‌ టీమ్‌ ఈవెంట్‌లో ఇషా, మను భాకర్‌, రిథమ్‌ సంగ్వాన్‌ బృందం 1751 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచింది. వ్యక్తిగత విభాగం ఫైనల్‌లో నుయెన్‌ తుయ్‌ ట్రాంగ్‌ (వియత్నాం) పసిడి దక్కించుకోగా, మను రజతం, ఇషా కాంస్యంతో సరిపెట్టుకుంది. మొత్తంగా ఈ ఆసియా చాంపియన్‌షి్‌పలో ఇషా మూడు స్వర్ణాలు, ఒక కాంస్యం సాధించడం విశేషం.

ఇవి కూడా చదవండి:

టీ20 ప్రపంచ కప్-2026: ఉత్కంఠ పోరులో ఇంగ్లాండ్ విజయం..

భారత్‌లో మరో సరికొత్త లీగ్..

Updated Date - Feb 10 , 2026 | 02:36 AM