Share News

ఇషా డబుల్‌ ధమాకా

ABN , Publish Date - Feb 05 , 2026 | 02:58 AM

ఆసియా షూటింగ్‌ చాంపియన్‌షిప్‌లో హైదరాబాద్‌ షూటర్‌ ఇషా సింగ్‌ రెండు పసిడి పతకాలు కొల్లగొట్టింది. బుధవారం జరిగిన ఈ పోటీల్లో ఇషా వ్యక్తిగత విభాగంతో పాటు టీమ్‌ ఈవెంట్‌లోనూ...

ఇషా డబుల్‌ ధమాకా

ఆసియా షూటింగ్‌లో రెండు స్వర్ణాలు

న్యూఢిల్లీ: ఆసియా షూటింగ్‌ చాంపియన్‌షిప్‌లో హైదరాబాద్‌ షూటర్‌ ఇషా సింగ్‌ రెండు పసిడి పతకాలు కొల్లగొట్టింది. బుధవారం జరిగిన ఈ పోటీల్లో ఇషా వ్యక్తిగత విభాగంతో పాటు టీమ్‌ ఈవెంట్‌లోనూ సత్తా చాటింది. 10 మీటర్ల ఎయిర్‌ పిస్టల్‌ వ్యక్తిగత విభాగం ఫైనల్లో ఇషా 239.8 పాయింట్లతో అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది. చైనీస్‌ తైపీ షూటర్లు రజత, కాంస్యాలు అందుకున్నారు. టీమ్‌ ఈవెంట్‌లో ఇషా (575), మనుభాకర్‌ (575), సురిచి (576) త్రయం 1726 పాయింట్లతో భారత్‌కు స్వర్ణం అందించారు. 10 మీటర్ల ఎయిర్‌ పిస్టల్‌లో భారత షూటర్‌ సమ్రాట్‌ కాంస్యం నెగ్గాడు. టీమ్‌ విభాగంలో సమ్రాట్‌, శ్రావణ్‌, వరుణ్‌ తోమర్‌ త్రయం 1732 పాయింట్లతో రజతం సాధించింది.

ఇవి కూడా చదవండి:

ఆ విషయంలో మాత్రం టీమిండియా జాగ్రత్తగా ఉండాలి: ధోని

అసామాన్య ప్రతిభకు నిలువెత్తు రూపం.. లిజెలీ లీ

Updated Date - Feb 05 , 2026 | 02:58 AM