Is Gambhirs Coaching Future In Trouble: గంభీర్.. ఇక కష్టమేనా
ABN , Publish Date - Jan 20 , 2026 | 05:29 AM
భారత క్రికెట్ జట్టు సిరీ్‌సలను కోల్పోవడం కొత్తేం కాదు.. గతంలోనూ ఇలాంటి ఓటములు ఎదురయ్యాయి. కానీ సొంత గడ్డపై టీమిండియాను మట్టికరిపించడం మాత్రం ఎంత...
భారత జట్టు కోచ్‌పై సర్వత్రా విమర్శలు
భారత క్రికెట్ జట్టు సిరీ్‌సలను కోల్పోవడం కొత్తేం కాదు.. గతంలోనూ ఇలాంటి ఓటములు ఎదురయ్యాయి. కానీ సొంత గడ్డపై టీమిండియాను మట్టికరిపించడం మాత్రం ఎంత పటిష్ట జట్టుకైనా కష్టంగానే ఉండేది. కానీ గౌతం గంభీర్ కోచ్‌గా వచ్చాక పరిస్థితులు మారాయి. భారత్‌లో భారత జట్టుపై పర్యాటక జట్లు అలవోకగా గెలవడంతో పాటు సిరీ్‌సలు కూడా ఎగరేసుకుపోతుండడం అభిమానులను కలచివేస్తోంది. తాజాగా న్యూజిలాండ్ గురించే చెప్పుకొంటే.. గతంలో ఇక్కడ ఐసీసీ టోర్నీలు, వన్డే సిరీస్‌ల కోసం 16 సార్లు పర్యటించినా ఫలితం సాధించలేదు. కానీ ద్వితీయ శ్రేణి జట్టుతో వచ్చిన కివీస్ 38 ఏళ్ల తర్వాత మొదటిసారి 2-1తో వన్డే సిరీస్‌ను పట్టేసింది. ఈ జట్టులో ఎనిమిది మంది ఆటగాళ్లకు అసలు భారత్‌లో ఆడిన అనుభవం కూడా లేదు. టీ20 ఫార్మాట్‌లో భారత్ ఫర్వాలేదనిపిస్తున్నా వన్డే, టెస్టుల్లో జట్టు ప్రదర్శన తీసికట్టుగా మారుతోంది. చాంపియన్స్ ట్రోఫీలో విజయాన్ని పక్కనబెడితే.. జట్టు శ్రీలంక, ఆసీ్‌స లోనూ వన్డే సిరీస్‌లను కోల్పోయింది. గతంలో కివీస్, దక్షిణాఫ్రికాలపై స్వదేశంలోనే టెస్టు సిరీ్‌సలో వైట్‌వాష్ అయ్యింది. అలాగే బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలోనూ నిరాశే ఎదురైంది. పైగా గౌతీ ధోరణి వల్లే విరాట్, రోహిత్ టెస్టులకు దూరమయ్యారనే అపవాదు నెలకొంది. దీనికి తోడు వ్యూహాల్లో స్పష్టత లోపించడం, ఆటగాళ్ల స్థానాల్లో పదే పదే మార్పు చేయడం, విఫలమవుతున్న వారినే కొనసాగించడం కూడా జట్టు విజయాలను దెబ్బతీస్తోంది. సిరీస్‌లో జడేజా ఏమాత్రం రాణించకపోయినా అన్ని మ్యాచ్‌లను ఆడేశాడు. అదే లెఫ్టామ్ పేసర్ అర్ష్‌దీ్‌పనకు మాత్రం చివరి మ్యాచ్‌లో చాన్స్ ఇవ్వగా.. మూడు వికెట్లు తీసి, తనను పక్కనబెట్టడం ఎంత తప్పో తెలిసొచ్చేలా చేశాడు.
(ఆంధ్రజ్యోతి క్రీడావిభాగం)
తప్పించాల్సిందేనా?
వచ్చే ఆరు నెలల వరకు భారత జట్టుకు వన్డే సిరీ్‌సలు లేవు. ఇక జట్టు దృష్టంతా వచ్చే నెల నుంచి జరిగే టీ20 వరల్డ్‌క్‌పపైనే ఉండనుంది. అయితే కివీ్‌సపై వన్డే సిరీస్ ఓటమితో కోచ్ గంభీర్ కొనసాగింపుపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అందుకే రాబోయే ఆరు నెలల్లో సెలెక్టర్లు, బీసీసీఐ కఠిన నిర్ణయం తీసుకునే అవకాశం ఉండవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. అలాగే ఆటగాళ్లతో పాటు మేనేజ్‌మెంట్ బృందంలోనూ మార్పులు జరిగినా ఆశ్చర్యపోనవసరం లేదు.
ఇవి కూడా చదవండి:
రో-కో మళ్లీ బరిలోకి దిగేదెప్పుడంటే.?
అన్నిసార్లూ భారీ స్కోర్లు చేయడం సాధ్యపడదు.. రోహిత్ ఫామ్‌పై గిల్ స్పందనిదే..