వేలంలోకి స్టార్క్, హెడ్
ABN , Publish Date - Nov 18 , 2026 | 06:06 AM
వచ్చే ఏడాది ఐపీఎల్-20 సీజన్ కోసం ఆయా ఫ్రాంచైజీలు తమ జట్ల బలాలను సరిచేసుకుంటున్నాయి. దీంట్లో భాగంగా పది జట్లు కూడా తాము అట్టిపెట్టుకున్న...
హెట్‌మయెర్ కూడా..
ముగిసిన ఐపీఎల్ రిటైన్ ఆటగాళ్ల గడువు
న్యూఢిల్లీ: వచ్చే ఏడాది ఐపీఎల్-20 సీజన్ కోసం ఆయా ఫ్రాంచైజీలు తమ జట్ల బలాలను సరిచేసుకుంటున్నాయి. దీంట్లో భాగంగా పది జట్లు కూడా తాము అట్టిపెట్టుకున్న ఆటగాళ్లతో పాటు వదిలేసిన వారి జాబితాలను కూడా విడుదల చేశాయి. మొత్తం 66 మందిని ఆయా జట్లు విడుదల చేయగా.. రూ. 297.95 కోట్లతో వేలానికి రానున్నాయి. వచ్చే నెల 16న గోవాలో మినీ వేలం జరుగనుంది. అయితే ఆస్ట్రేలియా జట్టు బిజీ షెడ్యూల్ కారణంగా సన్‌రైజర్స్ ఓపెనర్ ట్రావిస్ హెడ్, ఢిల్లీ క్యాపిటల్స్ పేసర్ మిచెల్ స్టార్క్ వచ్చే సీజన్‌కు అందుబాటులో ఉండబోమని ప్రకటించారు. అయితే ఆ ఇద్దరినీ రెండు జట్లూ వదిలించుకోవడం గమనార్హం. అలాగే కోల్‌కతా జట్టు రూ.18 కోట్లకు తీసుకున్న శ్రీలంక పేసర్ పథిరన, బంగ్లా పేసర్ ముస్తాఫిజుర్ కూడా వేలంలోకి రానున్నారు. ఇతర ప్రధాన ఆటగాళ్లలో బౌల్ట్, దీపక్ చాహర్, కేశవ్ (ముంబై), హెట్‌మయెర్, మిల్నే (రాజస్థాన్), ఉనాద్కట్, మధుశంక, కొట్జీ (సన్‌రైజర్స్), నేహల్ వధేరా (పంజాబ్), నితీశ్ రాణా, అభిషేక్ పోరెల్, కరుణ్ నాయర్ (ఢిల్లీ), షారుక్ ఖాన్, ఇషాంత్ (గుజరాత్), త్రిపాఠి, ఉమ్రాన్ మాలిక్, ముజరబాని, సైనీ (కోల్‌కతా), బెథెల్, గ్లీసన్ (ఆర్‌సీబీ), అవేశ్, హసరంగ, నోకియా (లఖ్‌నవూ), ప్రశాంత్ వీర్, జాన్సన్, మ్యాట్ హెన్రీ (చెన్నై) ఉన్నారు. లఖ్‌నవూ (రూ.47.45 కోట్లు) ఎక్కువ మొత్తంతో వేలానికి రానుంది.
ఇవి కూడా చదవండి:
అరుదైన గౌరవం.. ఐఎస్ఎస్ఎఫ్ అథ్లెట్స్ కమిటీలోకి భారత షూటర్ మను భాకర్
ఐపీఎల్ 2027: ఎల్ఎస్‌జీతో ట్రేడ్ డీల్.. రాజస్థాన్ రాయల్స్‌కు షమీ