ఆఖరి అవకాశం
ABN , Publish Date - Jan 21 , 2026 | 01:50 AM
దాదాపు మరో మూడు వారాల్లో ప్రతిష్ఠాత్మక టీ20 వరల్డ్‌క్‌పనకు తెర లేవనుంది. ఈ మెగా టోర్నీకి ముందు భారత్ పొట్టి ఫార్మాట్‌లో తమ బలాబలాలను అంచనా వేసుకునేందుకు...
రాత్రి 7 గం. నుంచి
స్టార్‌స్పోర్ట్స్‌లో
టీ20 మెగా టోర్నీకి రిహార్సల్
కెప్టెన్ సూర్యపై ఒత్తిడి
హార్దిక్, బుమ్రా రాక
నేటి నుంచి కివీ్‌సతో ధనాధన్ పోరు
నాగ్‌పూర్: దాదాపు మరో మూడు వారాల్లో ప్రతిష్ఠాత్మక టీ20 వరల్డ్‌క్‌పనకు తెర లేవనుంది. ఈ మెగా టోర్నీకి ముందు భారత్ పొట్టి ఫార్మాట్‌లో తమ బలాబలాలను అంచనా వేసుకునేందుకు ఆఖరిసారిగా బరిలోకి దిగబోతోంది. నేటి నుంచి న్యూజిలాండ్‌తో ఐదు టీ20ల సిరీస్ జరగునుంది. అలాగే ఇటీవలే వన్డే సిరీ్‌సను ప్రత్యర్థికి కోల్పోయిన టీమిండియాకు ఈ సిరీస్ కీలకం కానుంది. జట్టులోని లోపాలను సరిదిద్దుకునేందుకు ఈ మ్యాచ్‌లను సద్వినియోగం చేసుకోవాలనుకుంటోంది. కెప్టెన్ సూర్యకుమార్ ఫామ్ అన్నింటికంటే ముఖ్యం కానుంది. 2024లో అతను సారథిగా బాధ్యతలు తీసుకున్నాక జట్టు 72 శాతం విజయాలతో మెరుగ్గానే ఆడుతోంది. పొట్టి ప్రపంచకప్ తర్వాత జట్టు ఆడిన ఎనిమిది ద్వైపాక్షిక సిరీ్‌సలను కూడా గెలవడం విశేషం. అయితే సూర్య బ్యాట్ నుంచి మాత్రం పరుగులు రావడం లేదు. ఇలాంటి ఒత్తిడి మధ్య రాణించడంతో పాటు సిరీ్‌సను గెలిపించాల్సిన బాధ్యత కూడా అతడిపై ఉంది. అటు ప్రత్యర్థి న్యూజిలాండ్ ఇప్పటి వరకు భారత్‌లో టీ20 సిరీస్ గెలవలేదు. అందుకే 2024లో ఇక్కడ టెస్టు సిరీ్‌సను తాజాగా 37 ఏళ్ల తర్వాత వన్డే సిరీ్‌సను వశం చేసుకున్న మాదిరే పొట్టి ఫార్మాట్‌లోనూ సత్తా చూపాలనుకుంటోంది.
వన్‌డౌన్‌లో ఇషాన్: గాయం కారణంగా తిలక్ వర్మ తొలి మూడు మ్యాచ్‌లకు దూరమయ్యాడు. దీంతో మూడో నెంబర్‌లో ఇషాన్ కిషన్‌కు స్థానం కల్పించనున్నారు. ఇక గతేడాది 19 మ్యాచ్‌లాడిన సూర్య కేవలం 218 పరుగులే చేశాడు. దీంతో బ్యాటింగ్ పరంగా ఈ సిరీస్ అతడికి చావోరేవో లాంటిదే. ఓపెనర్ అభిషేక్ భీకర ఫామ్‌తో బౌలర్లను వణికిస్తుండగా.. శాంసన్ నిలకడ చూపాల్సి ఉంది. పేసర్ బుమ్రాతో పాటు ఆల్‌రౌండర్ హార్దిక్ జట్టులోకి రావడం సానుకూలాంశం. అర్ష్‌దీప్, హర్షిత్ ఇతర పేసర్లు. స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి బౌలింగ్‌ను కివీస్ బ్యాటర్లు పెద్దగా ఆడలేదు కాబట్టి అతను కీలకం కానున్నాడు.
ఆత్మవిశ్వాసంతో కివీస్: మిచెల్ శాంట్నర్ కెప్టెన్సీలో న్యూజిలాండ్ పూర్తి స్థాయి జట్టుతో పొట్టి ఫార్మాట్‌లో బరిలోకి దిగనుంది. అందుకే వన్డే సిరీస్ మాదిరే ఇందులోనూ ఆధిపత్యం చూపేందుకు ఎదురుచూస్తోంది. అటు వన్డే సిరీ్‌సలో ఏడు వికెట్లతో ఆకట్టుకున్న పేస్ ఆల్‌రౌండర్ క్రిస్టియాన్ క్లార్క్‌ను తొలి మూడు టీ20ల కోసం ఎంపిక చేశారు. అలాగే రచిన్, హెన్రీ, డఫీ జట్టులోకి వచ్చారు. బ్యాటింగ్‌లో డారిల్ మిచెల్, ఫిలిప్స్ భీకర ఫామ్‌లో ఉండగా కాన్వే, రచిన్, రాబిన్సన్ కూడా కీలకం కానున్నారు.
తుది జట్లు (అంచనా)
భారత్: అభిషేక్, శాంసన్, ఇషాన్, సూర్యకుమార్ (కెప్టెన్), హార్దిక్, అక్షర్, రింకూ సింగ్, దూబే, బుమ్రా, హర్షిత్/అర్ష్‌దీ్‌ప, వరుణ్.
న్యూజిలాండ్: రాబిన్సన్, కాన్వే, రచిన్, మిచెల్, ఫిలిప్స్, చాప్‌మన్, నీషమ్, శాంట్నర్ (కెప్టెన్), హెన్రీ, సోధీ, డఫీ.
పిచ్
భారత్‌లోని అతిపెద్ద మైదానాల్లో నాగ్‌పూర్ ఒకటి. పరిమిత ఓవర్ల మ్యాచ్‌ల్లో ఇక్కడ స్పిన్నర్లు కీలక పాత్ర పోషించారు. 2016లో చివరిసారి ఈ స్టేడియంలో జరిగిన టీ20 మ్యాచ్‌లో కివీస్ ముగ్గురు స్పిన్నర్లతో బరిలోకి దిగి భారత్‌ను 79 పరుగులకే కట్టడి చేసింది.
ఇవి కూడా చదవండి:
రో- కోకు డిమోషన్.. సెంట్రల్ కాంట్రాక్టుల్లో ‘బి గ్రేడ్’?
సమీపిస్తోన్న టీ20 ప్రపంచ కప్.. వివాదంలో రింకూ సింగ్!