Share News

India Open Badminton: ముగిసిన మనోళ్ల పోరు

ABN , Publish Date - Jan 17 , 2026 | 04:56 AM

Indias Campaign Ends at India Open as Lakshya Sen and Top Shuttlers Exit Early

India Open Badminton: ముగిసిన మనోళ్ల పోరు

ఇండియా ఓపెన్‌

  • లక్ష్య, కిడాంబి, ప్రణయ్‌ అవుట్‌

  • సాత్విక్‌, గాయత్రి జోడీలు కూడా

న్యూఢిల్లీ: సొంతగడ్డపై అభిమానులను మురిపిస్తారనుకున్న భారత షట్లర్లు నిరాశపరిచారు. ఇండియా ఓపెన్‌ బ్యాడ్మింటన్‌లో కనీసం ఫైనల్‌ కూడా చేరకుండానే తమ పోరును ముగించారు. కిడాంబి శ్రీకాంత్‌, హెచ్‌ఎస్‌ ప్రణయ్‌, సాత్విక్‌ సాయిరాజ్‌/చిరాగ్‌ శెట్టి, గాయత్రీ గోపీచంద్‌/ట్రీసా జాలీ ప్రీక్వార్టర్స్‌లోనే వెనుదిరగగా.. లక్ష్యసేన్‌ క్వార్టర్స్‌లో నిష్క్రమించాడు. దీంతో టోర్నీలో భారత్‌ పోరాటానికి తెరపడింది. శుక్రవారం జరిగిన హోరాహోరీపోరులో లక్ష్య 21-17, 13-21, 18-21తో ప్రపంచ 12వ ర్యాంకర్‌ లిన్‌ చున్‌ యి (చైనీస్‌ తైపీ) చేతిలో ఓడాడు. గురువారం జరిగిన సింగిల్స్‌ ప్రీక్వార్టర్స్‌లో శ్రీకాంత్‌ 14-21, 21-17, 17-21తో క్రిస్టో పొపోవ్‌ (ఫ్రాన్స్‌) చేతిలో, ప్రణయ్‌ 21-18, 19-21, 14-21తో లో కీన్‌ యే (సింగపూర్‌) చేతిలో ఓటమి చవిచూశారు. ఇక, పురుషుల డబుల్స్‌ ప్రీక్వార్టర్స్‌లో సాత్విక్‌/చిరాగ్‌ జోడీ 27-25, 21-23, 19-21తో జపాన్‌ జంట క్యోహీ యమషిత/హిరోకి మిదోరికోవా చేతిలో, మహిళల డబుల్స్‌లో గాయత్రి/ట్రీసా ద్వయం 22-20, 22-24, 21-23తో చైనా జోడీ లూవో యు/గ్జూ మిన్‌ లూవో చేతిలో పోరాడి ఓడారు.

ఇవి కూడా చదవండి:

రిటైర్డ్ ఔట్, రిటైర్డ్ హర్ట్ తేడా ఏంటంటే?

బుమ్రా కుమారుడి సూపర్ బౌలింగ్.. వీడియో వైరల్

Updated Date - Jan 17 , 2026 | 04:56 AM