రికర్వ్ అమ్మాయిల సంచలనం
ABN , Publish Date - May 08 , 2026 | 02:23 AM
పదిసార్లు ఒలింపిక్ చాంపియన్ కొరియాపై సంచలన విజయం సాధించిన భారత మహిళల రికర్వ్ జట్టు..పసిడి పోరుకు దూసుకెళ్లింది..
వరల్డ్‌కప్‌లో ఒలింపిక్ చాంప్ కొరియాకు షాక్
ఫైనల్లో భారత్
షాంఘై: పదిసార్లు ఒలింపిక్ చాంపియన్ కొరియాపై సంచలన విజయం సాధించిన భారత మహిళల రికర్వ్ జట్టు..పసిడి పోరుకు దూసుకెళ్లింది. ఆర్చరీ వరల్డ్ కప్ స్టేజ్-2లో గురువారం జరిగిన సెమీ్‌సలో అంకిత భకత్, కుంకుం అనిల్ మొహోద్, దీపికా కుమారితో కూడిన భారత్ 5-1తో కొరియాకు షాకిచ్చింది. ఆదివారం జరిగే ఫైనల్లో రెండో సీడ్ చైనాతో అమీతుమీ తేల్చుకోనుంది. కాగా, ధీరజ్, తరుణ్‌దీప్ రాయ్, యశ్‌దీ్‌ప భోజ్‌లతో కూడిన భారత పురుషుల జట్టు రెండో రౌండ్‌లో బంగ్లాదేశ్ చేతిలో 2-6తో చిత్తయింది. కాగా, రికర్వ్ మిక్స్‌డ్ విభాగం రెండో రౌండ్‌లో ధీరజ్-అంకిత జోడీ 4-5తో బ్రెజిల్ జంట చేతిలో ఓడింది. కాంపౌండ్ మిక్స్‌డ్ క్వార్టర్స్‌లో అదితి స్వామి-ప్రవీణ్ డియోతలే జంట 156-157తో అమెరికా ద్వయం చేతిలో పరాజయం పాలైంది.
ఇవి కూడా చదవండి:
ఐపీఎల్ ఫైనల్ వేదిక మార్పుపై స్పందించిన కర్ణాటక హోం మంత్రి
బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా కీలక పదవికి రాజీనామా