‘టాప్స్’ కోర్ గ్రూప్‌లోకి బాక్సర్లు
ABN , Publish Date - Apr 23 , 2026 | 01:43 AM
ఇటీవల ఆసియా చాంపియన్‌షి్‌పలో అదరగొట్టిన భారత బాక్సర్ల ప్రతిభకు ప్రోత్సాహం లభించింది. ఈనెల ఆరంభంలో మంగోలియా వేదికగా జరిగిన ఆ టోర్నీలో...
న్యూఢిల్లీ: ఇటీవల ఆసియా చాంపియన్‌షి్‌పలో అదరగొట్టిన భారత బాక్సర్ల ప్రతిభకు ప్రోత్సాహం లభించింది. ఈనెల ఆరంభంలో మంగోలియా వేదికగా జరిగిన ఆ టోర్నీలో పతకాలు సాధించిన నలుగురు బాక్సర్లు ప్రీతి పవార్ (54 కిలోలు), ప్రియ (60 కి.), అరుంధతి చౌదురి (70 కి.), సచిన్ (60 కి.)లను టార్గెట్ ఒలింపిక్ పోడియం పథకం (టాప్స్) కోర్ గ్రూప్‌లో చేర్చారు. ఈ మేరకు బుధవారం జరిగిన మిషన్ ఒలింపిక్ సెల్ (ఎమ్‌వోసీ) భేటీలో ఈ నిర్ణయం తీసుకున్నారు. మరో ముగ్గురు బాక్సర్లు ఆదిత్య (65 కి.), దీపక్ (70 కి.), హర్ష్ (90 కి.)లకు టాప్స్ డెవల్‌పమెంట్ గ్రూప్‌లో చోటు కల్పించారు. దీంతో బాక్సింగ్ నుంచి ‘టాప్స్’ కోర్ గ్రూప్‌లో ఓవరాల్‌గా ఏడుగురు, డెవల్‌పమెంట్ గ్రూప్‌లో 25 మంది, టార్గెట్ ఆసియా గేమ్స్ గ్రూప్ (టీఏజీజీ)లో ఒకరు ఉన్నారు. వీరందరికీ వచ్చే కామన్వెల్త్, ఆసియా క్రీడల్లో రాణించేందుకు కావాల్సిన ఆర్ధిక, శిక్షణ సహకారాన్ని ‘టాప్స్’ కింద అందించనున్నారు.
ఇవి కూడా చదవండి:
డ్రగ్స్ టెస్టులో పాజిటివ్.. పాక్ క్రికెటర్ కాంట్రాక్ట్ రద్దు చేసిన పీసీబీ
భారత లీగ్‌లో ఆడినందుకు ఆసీస్ మాజీ ప్లేయర్‌పై వేటు