మీనాక్షి, నితేశ్‌కు రజతాలు
ABN , Publish Date - Apr 11 , 2026 | 05:03 AM
ఆసియా సీనియర్ రెజ్లింగ్ చాంపియన్‌షిప్‌లో మీనాక్షి గోయత్ (53 కిలోలు), నితేశ్ (97 కిలోలు) రజత పతకాలు...
బిష్కెక్ (కిర్గిస్థాన్): ఆసియా సీనియర్ రెజ్లింగ్ చాంపియన్‌షిప్‌లో మీనాక్షి గోయత్ (53 కిలోలు), నితేశ్ (97 కిలోలు) రజత పతకాలు సాధించారు. శుక్రవారం జరిగిన ఫైనల్లో మీనాక్షి 0-10తో జిన్ ఝాంగ్ (చైనా) చేతిలో ఓటమిపాలై రన్నరప్‌గా నిలిచింది. తుదిపోరులో నితేశ్ 1-7తో మహ్మదాది (ఇరాన్) చేతిలో ఓడాడు. మోనిక (65 కి.), హర్షిత (72 కి.), సచిన్ (67 కి.), ప్రిన్స్ (82 కి.) కాంస్యాలు గెలిచారు. సుజీత్ (65 కి.), అభిమన్యు (70 కి.), సందీప్ (79 కి.) సెమీస్‌లో నెగ్గి ఫైనల్ చేరారు.
ఈ వార్తలు కూడా చదవండి
మహిళల జోలికొస్తే అదే చివరి రోజు: మంత్రి సవిత..
బొత్స భావోద్వేగం.. వైఎస్ షర్మిల రియాక్షన్