క్వార్టర్స్‌లో సురేఖ జట్టు అవుట్
ABN , Publish Date - May 07 , 2026 | 04:25 AM
ఆర్చరీ వరల్డ్‌కప్ స్టేజ్-2లో జ్యోతి సురేఖ నేతృత్వంలోని కాంపౌండ్ మహిళల జట్టు ఘోరంగా విఫలమైంది....
ఆర్చరీ వరల్డ్‌కప్ స్టేజ్-2
షాంఘై: ఆర్చరీ వరల్డ్‌కప్ స్టేజ్-2లో జ్యోతి సురేఖ నేతృత్వంలోని కాంపౌండ్ మహిళల జట్టు ఘోరంగా విఫలమైంది. బుధవారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో జ్యోతి సురేఖ, ప్రగతి, అదితి స్వామిలతో కూడిన భారత్ 227-233తో టర్కీ చేతిలో ఓడి.. పతకం లేకుండా టోర్నీ నుంచి నిష్క్రమించింది. కాగా, పురుషుల కాంపౌండ్ జట్టు కాంస్య పతక పోరులో చైనా చేతిలో పరాజయం పాలైంది. కాగా ధీరజ్, తరుణ్‌దీప్ రాయ్, యశ్‌దీ్‌పలతో కూడిన పురుషుల జట్టు రికర్వ్ టీమ్ ర్యాంకింగ్స్‌లో ఎనిమిదో స్థానంలో నిలిచింది. ఇక, మహిళల విభాగంలో అంకిత భకత్, కుంకుం మొహోద్, దీపిక కుమారితో కూడిన భారత జట్టు నాలుగో ర్యాంక్ దక్కించుకొంది. మిక్స్‌డ్ విభాగంలో అంకిత, ధీరజ్ ద్వయం ఆరో ర్యాంక్‌లో నిలిచింది.
ఇవి కూడా చదవండి:
సంజు శాంసన్ మా జట్టుకు వెన్నుముక: రుతురాజ్
భారత టీ20 జట్టులో వైభవ్ సూర్యవంశీకి అవకాశం!