ఇటలీతో భారత్ ఢీ
ABN , Publish Date - Mar 13 , 2026 | 03:10 AM
ప్రపంచ కప్ బెర్త్‌ను ఇప్పటికే సొంతం చేసుకున్న భారత మహిళలు ఇక..క్వాలిఫయర్స్ టోర్నీ టైటిల్ అందుకోవాలని పట్టుదలగా ఉన్నారు. ఈ క్రమంలో...
మరో సెమీస్‌లో ఇంగ్లండ్ X స్కాట్లాండ్
ప్రపంచ కప్ హాకీ క్వాలిఫయర్స్
హైదరాబాద్: ప్రపంచ కప్ బెర్త్‌ను ఇప్పటికే సొంతం చేసుకున్న భారత మహిళలు ఇక..క్వాలిఫయర్స్ టోర్నీ టైటిల్ అందుకోవాలని పట్టుదలగా ఉన్నారు. ఈ క్రమంలో గచ్చిబౌలి హాకీ స్టేడియంలో శుక్రవారం రాత్రి 7.30కి జరిగే సెమీఫైనల్లో ఇటలీతో తలపడనున్నారు. మూడు మ్యాచ్‌ల ద్వారా ఏడు పాయింట్లు ఖాతాలో వేసుకొన్న మనోళ్లు గ్రూప్ ‘బి’లో అగ్రస్థానంలో నిలిచారు. పూల్ దశలో భారత్ రెండు విజయాలు సాధించి, ఒక మ్యాచ్ డ్రా చేసింది. మరోవైపు ఒక గెలుపు, మరో డ్రా, ఇంకో పరాజయంతో 4 పాయింట్లు కైవసం చేసుకున్న ఇటలీ పూల్ ‘ఎ’లో రెండో స్థానం చేజిక్కించుకున్నది. అంతేకాదు..2012 నుంచి రెండు జట్లు ఏడుసార్లు తలపడ్డాయి. ఐదుసార్లు భారత్ విజయం అందుకుంది. ఇటలీ ఒక మ్యాచ్‌లో నెగ్గగా, మరొకటి డ్రాగా ముగిసింది. కాగా సాయంత్రం 5.15కు ఇంగ్లండ్-స్కాట్లాండ్‌ల మధ్య తొలి సెమీఫైనల్ జరుగుతుంది.
ఇవి కూడా చదవండి:
అక్షర్ పటేల్‌కు క్షమాపణలు చెప్పిన సూర్య కుమార్.. ఎందుకంటే
'ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్' సంజు కాదు.. డివిలియర్స్ ఆసక్తికర వ్యాఖ్యలు