Share News

అమ్మాయిలకు కఠిన పరీక్ష

ABN , Publish Date - Aug 16 , 2026 | 05:45 AM

మహిళల హాకీ ప్రపంచకప్‌ను భారత జట్టు గెలుపుతో ఆరంభించాలనుకొంటోంది. గ్రూప్‌-డిలో భాగంగా ఆదివారం జరిగే తమ తొలి మ్యాచ్‌లో...

అమ్మాయిలకు కఠిన పరీక్ష

చైనాతో భారత్‌ పోరు నేడు మహిళల హాకీ వరల్డ్‌కప్‌

సా. 4.30 నుంచి స్టార్‌ నెట్‌వర్క్‌లో

అమ్‌స్టెల్‌వీన్‌ (నెదర్లాండ్స్‌): మహిళల హాకీ ప్రపంచకప్‌ను భారత జట్టు గెలుపుతో ఆరంభించాలనుకొంటోంది. గ్రూప్‌-డిలో భాగంగా ఆదివారం జరిగే తమ తొలి మ్యాచ్‌లో ఒలింపిక్‌ రజత పతక విజేత, రెండో ర్యాంకర్‌ చైనాతో భారత్‌ తలపడనుంది. మారిన ఫార్మాట్‌ నేపథ్యంలో టోర్నీలో ప్రతీమ్యాచ్‌ కీలకం కావడంతో.. చైనాతో పోరు సలీమా టెటె ఆధ్వర్యంలోని భారత బృందానికి కఠిన పరీక్షగానే భావించాలి. అయితే, నేషన్స్‌ కప్‌ నెగ్గిన జోష్‌లో ఉన్న భారత్‌ ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగుతోంది. కాగా, ఇటీవల మేటి జట్లకు గట్టిపోటీ ఇస్తున్న చైనాను ఏమాత్రం తేలిగ్గా తీసుకొన్నా.. భారత్‌కు కష్టమే.

ఇవి కూడా చదవండి..

బెంగళూరులో బెంగాల్ యువకుడి అరెస్ట్.. ఉగ్రసంస్థల లింకులతో దర్యాప్తు..

అరుణాచల్‌ప్రదేశ్‌లో వరద బీభత్సం.. నలుగురి మృతి, ఆర్మీ సిబ్బంది గల్లంతు..

Updated Date - Aug 16 , 2026 | 05:45 AM