క్వార్టర్స్‌కు మనమ్మాయిలు
ABN , Publish Date - Sep 09 , 2026 | 04:39 AM
మహిళల జూనియర్ ఆసియాక్‌పలో డిఫెండింగ్ చాంపియన్ భారత్ క్వార్టర్ ఫైనల్‌కు దూసుకెళ్లింది...
7-0తో జపాన్ చిత్తు
జూ. ఆసియాకప్ హాకీ
మోకి (చైనా): మహిళల జూనియర్ ఆసియాక్‌పలో డిఫెండింగ్ చాంపియన్ భారత్ క్వార్టర్ ఫైనల్‌కు దూసుకెళ్లింది. మంగళవారం జరిగిన మ్యాచ్‌లో భారత్ 7-0తో జపాన్‌ను చిత్తు చేసింది. మూడు మ్యాచ్‌ల నుంచి 9 పాయుంట్లతో ఎలీట్ పూల్‌లో టాప్‌లో నిలిచింది. బుధవారం జరిగే ఆఖరి లీగ్ మ్యాచ్‌లో చైనాతో భారత్ ఆడనుంది. జపాన్‌పై ఆట ఐదో నిమిషంలో కృష్ణ శర్మ, మరో నాలుగు నిమిషాల తర్వాత సుప్రియ, 14వ నిమిషంలో పూర్ణిమ యాదవ్ గోల్స్ చేశారు. ఇక మూడో క్వార్టర్‌లో ఐదు నిమిషాల తేడాతో గీతా యాదవ్ రెండు గోల్స్.. పూర్ణిమ మరో గోల్ చేయడంతో భారత్ 6-0తో తిరుగులేని స్థితిలో నిలిచింది. 50వ నిమిషంలో సనిక జట్టుకు ఏడో గోల్ అందించింది.
ఇవి కూడా చదవండి:
గిల్‌పై ప్రతీకారం తీర్చుకున్న అభిషేక్ శర్మ.. వీడియో వైరల్!
అఫ్గానిస్థాన్‌తో టీ20 సిరీస్.. వాషింగ్టన్ సుందర్ ఫిట్