Share News

వరల్డ్‌కప్‌ బెర్త్‌పైనే గురి!

ABN , Publish Date - Mar 08 , 2026 | 03:39 AM

మహిళల వరల్డ్‌కప్‌ బెర్త్‌ను సొంతం చేసుకోవడానికి భారత్‌కు సువర్ణావకాశం. ఆదివారం నుంచి జరిగే మహిళల వరల్డ్‌కప్‌ క్వాలిఫయర్స్‌లో భారత హాకీ జట్టు సత్తాచాటాలనే పట్టుదలతో ఉంది...

వరల్డ్‌కప్‌ బెర్త్‌పైనే గురి!

  • హైదరాబాద్‌ వేదికగా మహిళల హాకీ క్వాలిఫయర్స్‌

  • ఉరుగ్వేతో భారత్‌ ఢీ ఫ రాత్రి 7.30 నుంచి

హైదరాబాద్‌: మహిళల వరల్డ్‌కప్‌ బెర్త్‌ను సొంతం చేసుకోవడానికి భారత్‌కు సువర్ణావకాశం. ఆదివారం నుంచి జరిగే మహిళల వరల్డ్‌కప్‌ క్వాలిఫయర్స్‌లో భారత హాకీ జట్టు సత్తాచాటాలనే పట్టుదలతో ఉంది. ఈ టోర్నీ ద్వారా మూడు వరల్డ్‌కప్‌ బెర్త్‌లు నేరుగా ఖరారు కానున్నాయి. మొత్తం 8 జట్లు పాల్గొంటున్న టోర్నీలో గ్రూప్‌-ఎలో ఆస్ట్రేలియా, ఇటలీ, ఇంగ్లండ్‌, కొరియా.. గ్రూప్‌-బిలో భారత్‌తోపాటు స్కాట్లాండ్‌, ఉరుగ్వే, వేల్స్‌ జట్లున్నాయి. తొలి మ్యాచ్‌లో ఉరుగ్వేతో భారత్‌ తలపడనుంది. ఫైనల్‌కు చేరిన రెండు జట్లతోపాటు కాంస్యం సాధించిన జట్టు ఆగస్టు 15 నుంచి 30 వరకు జరిగే ప్రపంచక్‌పనకు అర్హత సాధిస్తాయి. మొత్తం 16 జట్లు పాల్గొనే ఈ ప్రపంచక్‌పనకు 9 జట్లు కాంటినెంటల్‌ టోర్నీలద్వారా అర్హత సాధించాయి. మరో 7 జట్లు ఈ అర్హత టోర్నీల ద్వారా వస్తాయి. హైదరాబాద్‌తోపాటు చిలీలోని శాంటియాగోలోనూ 8 జట్లతో మరో క్వాలిఫయింగ్‌ టోర్నీ జరుగుతోంది. అక్కడనుంచి కూడా మూడు జట్లు అర్హత సాధిస్తాయి. వీటితోపాటు ఈ రెండు టోర్నీల్లో నాలుగోస్థానంలో నిలిచిన రెండు జట్లనుంచి ఒక ఉత్తమ టీమ్‌ కూడా క్వాలిఫై అవుతుంది.

ఇవి కూడా చదవండి:

టీమిండియాలో ప్రతి ప్లేయర్ డేంజరే.. మేం చాలా జాగ్రత్తగా ఆడాలి: కివీస్ కెప్టెన్ శాంట్నర్

ఈసారైనా గెలవండి.. లేదంటే ఆ చోకర్స్ ట్యాగ్ మీకిచ్చేస్తా: కివీస్‌కు డేల్ స్టెయిన్ వార్నింగ్

Updated Date - Mar 08 , 2026 | 03:39 AM