Share News

సెమీ‌స్‌లో భారత్‌

ABN , Publish Date - Mar 12 , 2026 | 05:41 AM

ఎఫ్‌ఐహెచ్‌ మహిళల హాకీ వరల్డ్‌ కప్‌ క్వాలిఫయర్స్‌లో నవ్‌నీత్‌ కౌర్‌ హ్యాట్రిక్‌ గోల్స్‌తో భారత్‌ను సెమీస్‌కు చేర్చింది.

సెమీ‌స్‌లో భారత్‌

నవ్‌నీత్‌ హ్యాట్రిక్‌ వరల్డ్‌కప్‌ హాకీ క్వాలిఫయర్స్‌

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి క్రీడాప్రతినిధి): ఎఫ్‌ఐహెచ్‌ మహిళల హాకీ వరల్డ్‌ కప్‌ క్వాలిఫయర్స్‌లో నవ్‌నీత్‌ కౌర్‌ హ్యాట్రిక్‌ గోల్స్‌తో భారత్‌ను సెమీస్‌కు చేర్చింది. బుధవారం గచ్చిబౌలిలోని జీఎంసీ బాలయోగి హాకీ స్టేడియంలో జరిగిన పూల్‌-బి మ్యాచ్‌లో భారత్‌ 4-1తో వేల్స్‌పై గెలిచింది. సాక్షి రాణా (7వ ని.) గోల్‌తో భారత్‌ ఖాతా తెరవగా, తర్వాత నవ్‌నీత్‌ (29వ, 34వ, 55వ నిమిషాల్లో) హ్యాట్రిక్‌ గోల్స్‌తో భారత్‌ తిరుగులేని విజయం సాధించింది. పూల్‌-బిలో 7 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచిన భారత్‌ జట్టు శుక్రవారం జరిగే సెమీ్‌సలో ఇటలీతో తలపడనుంది. ఈరోజుతో 200 మ్యాచ్‌లను పూర్తి చేసుకున్న భారత డిఫెండర్‌ నిక్కీ ప్రధాన్‌ను హాకీ ఇండియా సన్మానించింది. ఇతర మ్యాచ్‌ల్లో స్కాట్లాండ్‌ 3-1తో ఉరుగ్వేపై నెగ్గగా, ఇటలీ.. కొరియా మ్యాచ్‌ 1-1తో డ్రాగా ముగిసింది.

ఇవి కూడా చదవండి:

ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్: అగ్రస్థానంలోనే అభిషేక్ శర్మ.. సత్తా చాటిన ఇషాన్ కిషన్

టీమిండియా కష్టాన్ని తక్కువ చేయొద్దు.. కీర్తి ఆజాద్‌పై వ్యాఖ్యలపై గంభీర్ కౌంటర్

Updated Date - Mar 12 , 2026 | 10:11 AM