ఇంగ్లండ్‌తో అమ్మాయిల పోరు నేడు
ABN , Publish Date - Aug 20 , 2026 | 05:59 AM
హాకీ ప్రపంచక్‌పలో ఓటమి లేకుండా కొనసాగుతున్న భారత మహిళలు రెండో రౌండ్‌కు చేరడమే లక్ష్యంగా ఇంగ్లండ్‌తో అమీతుమీకి సిద్ధమయ్యారు..
సా.6.30 నుంచి
హాకీ ప్రపంచ కప్
ఆమ్‌స్టెల్‌వీన్: హాకీ ప్రపంచక్‌పలో ఓటమి లేకుండా కొనసాగుతున్న భారత మహిళలు రెండో రౌండ్‌కు చేరడమే లక్ష్యంగా ఇంగ్లండ్‌తో అమీతుమీకి సిద్ధమయ్యారు. ఈ క్రమంలో ఇరుజట్ల మధ్య గురువారం గ్రూప్ ‘డి’ చివరి లీగ్ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌ను డ్రా చేసుకొంటే చాలు..గ్రూప్ టాపర్‌గా మనోళ్లు తదుపరి రౌండ్‌లో అడుగుపెడతారు. ఆరంభ మ్యాచ్‌లో..ఒలింపిక్ రజత పతక విజేత చైనాను 2-2 నిలువరించిన భారత మహిళలు..ఆ తర్వాత దక్షిణాఫ్రికాను 6-1తో చిత్తు చేసిన విషయం విదితమే. భారత్, చైనా చెరో నాలుగేసి పాయింట్లతో సమంగా ఉన్నా..మెరుగైన గోల్స్ భేదంతో మనోళ్లు గ్రూప్ టాపర్‌గా నిలిచారు. మరోవైపు మూడు పాయింట్లతో ఉన్న ఇంగ్లండ్ మెగా టోర్నీలో ఆశలు సజీవంగా ఉంచుకోవాలంటే భారత్‌పై గెలవడం తప్పనిసరి.
ఈ వార్తలనూ చదవండి: