Share News

పసిడి పంట

ABN , Publish Date - Apr 10 , 2026 | 01:53 AM

ఆసి యా చాంపియన్‌షి్‌పలో భారత బాక్సర్లు పసిడి మోత మోగించారు. గురువారంనాటి పోటీలలో మీనాక్షి హూ డా...

పసిడి పంట

మీనాక్షి, ప్రీతి, ప్రియ, అరుంధతికి టైటిళ్లు

ఉలాన్‌బాటర్‌ (మంగోలియా): ఆసి యా చాంపియన్‌షి్‌పలో భారత బాక్సర్లు పసిడి మోత మోగించారు. గురువారంనాటి పోటీలలో మీనాక్షి హూ డా (48కి.), ప్రీతీ పవార్‌ (54కి.), ప్రియ (60కి.), అరుంధతి చౌధరి (70కి.) స్వర్ణ పతకాలు కొల్లగొట్టారు. అల్ఫియా పఠాన్‌ (80కి.+) రజత పతకంతో మెరిసింది. మొత్తంగా భారత మహిళలు చాంపియన్‌షి్‌పను 10 (4-2-4) పతకాలతో ఘనంగా ముగించారు. 48కి. ఫైనల్లో మీనాక్షి 5-0తో ఎన్‌ఖ్‌ (మంగోలియా)ను ఓడించి పసిడి నెగ్గింది. 54కి.లో ప్రీతీపవార్‌ కూడా 5-0తో హువాంగ్‌ (తైపీ)కి షాకిచ్చి స్వర్ణం దక్కించుకుంది. 60కి. టైటిల్‌ ఫైట్‌లో ప్రియ 3-0తో వాన్‌ ఉన్‌ యాంగ్‌ (ఉత్తరకొరియా)పై గెలుపొంది స్వర్ణం అందించింది. 70కి. విభాగంలో అరుంధతి 4-1తో సీడిష్‌ (కజకిస్థాన్‌)పై నెగ్గి పసిడి అందుకుంది. 57 కి. ఫైనల్లో జాస్మిన్‌ రజతంతో సంతృప్తి చెందింది. 80కి.+ విభాగం ఫైనల్లో అల్ఫియా 0-5తో దినా (కజకిస్థాన్‌) చేతిలో ఓటమితో రజతం కైవసం చేసుకుంది. ఇక..నిఖత్‌జరీన్‌ (54కి.), అంకుషిత(65కి.), లవ్లీనా (75కి.), పూజ (80కి.) కాంస్యాలు గెలుపొందిన సంగతి తెలిసిందే.

ఇవి కూడా చదవండి:

ఎంఐపై హాఫ్ సెంచరీ మిస్.. వెక్కి వెక్కి ఏడ్చిన వైభవ్ సూర్యవంశీ

ఎంఐ-ఆర్ఆర్: మా ఓటమికి బౌలర్లే ప్రధాన కారణం.. హార్దిక్ పాండ్య

Updated Date - Apr 10 , 2026 | 01:53 AM