మనమ్మాయిల బోణీ
ABN , Publish Date - Nov 20 , 2026 | 05:06 AM
ఆసియా చాంపియన్స్ ట్రోఫీలో డిఫెండింగ్ చాంప్ భారత మహిళల హాకీ జట్టు శుభారంభం చేసింది. గురువారం జరిగిన తమ తొలి మ్యాచ్‌లో...
మలేసియాపై గెలుపు
ఆసియా చాంపియన్స్ ట్రోఫీ
భోపాల్: ఆసియా చాంపియన్స్ ట్రోఫీలో డిఫెండింగ్ చాంప్ భారత మహిళల హాకీ జట్టు శుభారంభం చేసింది. గురువారం జరిగిన తమ తొలి మ్యాచ్‌లో భారత్ 4-1తో మలేసియాను చిత్తు చేసింది. 19వ నిమిషంలోనే మలేసియా ప్లేయర్ నురామిరా గోల్ చేసింది. అయితే, ఆ తర్వాతి నిమిషంలో ముంతాజ్ ఖాన్ గోల్ సాధించింది. సెకండా్‌ఫలో సలీమా టెటే (35వ), పూజా సాహు (39వ), లాల్‌రెమ్సియామి (49వ) పెనాల్టీ కార్నర్‌లను గోల్స్‌గా మలిచారు. ఇతర మ్యాచ్‌ల్లో చైనా 7-0తో థాయ్‌లాండ్‌పై, జపాన్ 1-0తో కొరియాపై గెలిచాయి. శనివారం జరిగే తమ రెండో మ్యాచ్‌లో కొరియాతో భారత్ తలపడనుంది.
ఇవి కూడా చదవండి:
భారత్‌తో టెస్టు మ్యాచ్: ముగిసిన తొలి రోజు ఆట.. కివీస్ స్కోర్ 243/5
టెన్నిస్ ఛాంపియన్‌షిప్ విజేతగా లారా దత్తా కుమార్తె..