ఆసియా మనదే
ABN , Publish Date - Nov 06 , 2026 | 07:01 AM
ఆఖరి క్వార్టర్స్‌లో అదరగొట్టిన డిఫెండింగ్ చాంపియన్ భారత్.. ఆసియా చాంపియన్స్ హాకీ ట్రోఫీని వరుసగా మూడోసారి ముద్దాడింది. టోర్నీ ఆసాంతం...
భారత్ ఖాతాలో ఆరో హాకీ చాంపియన్స్ ట్రోఫీ
ఫైనల్లో 4-1తో జపాన్‌పై గెలుపు
మొహాలీ: ఆఖరి క్వార్టర్స్‌లో అదరగొట్టిన డిఫెండింగ్ చాంపియన్ భారత్.. ఆసియా చాంపియన్స్ హాకీ ట్రోఫీని వరుసగా మూడోసారి ముద్దాడింది. టోర్నీ ఆసాంతం అజేయంగా నిలిచిన మన జట్టు.. ఓవరాల్‌గా ఆరోసారి ఈ టైటిల్‌ను సొంతం చేసుకొంది. 2011, 2016, 2018, 2023, 2024లో కూడా భారత్ విజేతగా నిలిచింది. గురువారం ఉత్కంఠభరితంగా జరిగిన ఫైనల్లో భారత్ 4-1తో జపాన్‌ను ఓడించింది. శిలానంద్ లక్రా (42వ నిమిషం), దిల్‌ప్రీత్ సింగ్ (48వ), జుగ్‌రాజ్ సింగ్ (53వ), వివేక్ సాగర్ (54వ) తలో గోల్ చేశారు. కజుమాస మట్సుమోటో (3వ నిమిషం) జపాన్‌కు ఏకైక గోల్ అందించాడు. కాంస్య పోరులో మలేసియా 5-2తో కొరియాను ఓడించింది.
ఈ వార్తలు కూడా చదవండి
లాస్ ఏంజెలెస్ సిటీ అటార్నీగా భారత సంతతి మహిళ..
పొత్తు లేకపోతే అన్ని స్థానాల్లో పోటీ చేస్తాము: చిరాగ్ పాశ్వాన్