సురేఖ, చికితకు రజతం
ABN , Publish Date - Jul 12 , 2026 | 03:27 AM
ఆర్చరీ ప్రపంచకప్ స్టేజ్-4 పోటీల్లో తెలుగమ్మాయిలు జ్యోతి సురేఖ, చికిత తానిపర్తి పతకంతో మెరిశారు...
ప్రీతిక డబుల్ ధమాకా ఫ ఆర్చరీ ప్రపంచకప్
మాడ్రిడ్: ఆర్చరీ ప్రపంచకప్ స్టేజ్-4 పోటీల్లో తెలుగమ్మాయిలు జ్యోతి సురేఖ, చికిత తానిపర్తి పతకంతో మెరిశారు. మహిళల కాంపౌండ్ టీమ్ ఈవెంట్ ఫైనల్లో జ్యోతి సురేఖ, చికిత, ప్రీతికా ప్రదీ్‌పలతో కూడిన భారత జట్టు ఫైనల్లో 228-232తో కొలంబియా బృందం చేతిలో ఓటమిపాలై రజత పతకంతో సరిపెట్టుకుంది. ఇక, మహారాష్ట్రకు చెందిన 17 ఏళ్ల ప్రీతికా ప్రదీప్ రెండు పతకాలతో సత్తా చాటింది. టీమ్ ఈవెంట్‌లో రజతం నెగ్గిన ప్రీతిక.. కాంపౌండ్ వ్యక్తిగత ఈవెంట్‌లో కాంస్యం గెలిచింది.
ఇవీ చదవండి:
స్టోక్స్ రిటైర్మెంట్ వీడియోపై రచ్చ.. ఈసీబీకి ఐసీసీ క్లీన్ చిట్!
ఆ ఫొటోలు చూసి కోహ్లీ షాకైపోయాడు: ఇంగ్లండ్ బ్యాటర్ జార్డన్ కాక్స్