Share News

కీలక మ్యాచ్‌లో టాస్ జింబాబ్వేదే.. మొదటి బ్యాటింగ్ ఎవరిదంటే..

ABN , Publish Date - Feb 26 , 2026 | 06:46 PM

టీ-20 ప్రపంచకప్‌లో టీమిండియా మరో కీలక మ్యాచ్‌కు సిద్ధమవుతోంది. సూపర్-8 పోరులో భాగంగా మరికాసేపట్లో చెన్నైలోని చిదంబరం స్టేడియంలో జింబాబ్వేతో తలపడబోతంది. దక్షిణాఫ్రికాతో జరిగిన గత మ్యాచ్‌లో టీమిండియా ఓటమి పాలైన నేపథ్యంలో ఈ రోజు జరగబోయే మ్యాచ్ కీలకంగా మారింది.

కీలక మ్యాచ్‌లో టాస్ జింబాబ్వేదే.. మొదటి బ్యాటింగ్ ఎవరిదంటే..
India vs Zimbabwe

టీ-20 ప్రపంచకప్‌లో టీమిండియా మరో కీలక మ్యాచ్‌కు సిద్ధమవుతోంది. సూపర్-8 పోరులో భాగంగా మరికాసేపట్లో చెన్నైలోని చిదంబరం స్టేడియంలో జింబాబ్వేతో తలపడబోతంది. దక్షిణాఫ్రికాతో జరిగిన గత మ్యాచ్‌లో టీమిండియా ఓటమి పాలైన నేపథ్యంలో ఈ రోజు జరగబోయే మ్యాచ్ కీలకంగా మారింది. ఈ మ్యాచ్‌లోనూ, విండీస్‌తో జరగబోయే మ్యాచ్‌లోనూ విజయం సాధిస్తేనే టీమిండియా తర్వాతి దశకు చేరుకుంటుంది (India vs Zimbabwe).


ఈ నేపథ్యంలో టాస్ గెలిచిన జింబాబ్వే కెప్టెన్ సికిందర్ రజా బౌలింగ్ ఎంచుకున్నాడు. దీంతో టీమిండియా బ్యాటింగ్‌కు రెడీ అవుతోంది. ఊహించినట్టుగానే భారత తుది జట్టులో రెండు మార్పులు జరిగాయి. సంజూ శాంసన్, అక్షర్ పటేల్ తుది జట్టులో చోటు దక్కించుకున్నారు. వాషింగ్టన్ సుందర్, రింకూ సింగ్ జట్టులో చోటు కోల్పోయారు (IND vs ZIM T20 World Cup).


తుదిజట్లు:

టీమిండియా: అభిషేక్ శర్మ, సంజూ శాంసన్, ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబె, అక్షర్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి, జస్ప్రీత్ బుమ్రా

జింబాబ్వే: మరుమణి, బెనెట్, డియోన్ మైర్స్, ర్యాన్ బర్ల్, సికిందర్ రజా, మున్‌యోంగా, ముసేకివా, బ్రాడ్ ఏవన్స్, మపోసా, రిచర్డ్ గరావా, ముజరబని


ఇవి కూడా చదవండి..

ట్రంప్ ప్రభుత్వానికి మరో షాక్.. అలా చేయడం చట్ట విరుద్ధమని తేల్చిన న్యాయస్థానం..


తొమ్మిదేళ్ల బాలికకు కార్డియాక్ అరెస్ట్.. స్కూల్‌లో ఆడుకుంటూ కుప్పకూలిపోయింది..

Updated Date - Feb 26 , 2026 | 06:46 PM