ఒకే గ్రూప్‌లో భారత్, పాక్
ABN , Publish Date - Mar 18 , 2026 | 02:27 AM
పురుషుల హాకీ ప్రపంచక్‌పలో భారత్, పాకిస్థాన్ ఒకే గ్రూప్ నుంచి తలపడనున్నాయి. నెదర్లాండ్స్, బెల్జియం సంయుక్త ఆతిథ్యంలో ఈ ఏడాది ఆగస్టు 15 నుంచి...
హాకీ ప్రపంచకప్
లసాన్నె: పురుషుల హాకీ ప్రపంచక్‌పలో భారత్, పాకిస్థాన్ ఒకే గ్రూప్ నుంచి తలపడనున్నాయి. నెదర్లాండ్స్, బెల్జియం సంయుక్త ఆతిథ్యంలో ఈ ఏడాది ఆగస్టు 15 నుంచి 30 వరకు ప్రపంచకప్ జరగనుంది. ఈ టోర్నీకి సంబంధించి జట్ల డ్రాను మంగళవారం ప్రకటించారు. ఇంగ్లండ్, వేల్స్ జట్లతో కలిసి భారత్, పాక్ గ్రూప్-డి తరఫున బరిలోకి దిగనున్నాయి. ఇక, ఇదే వేదికలుగా, ఇదే తేదీల్లో జరిగే మహిళల ప్రపంచక్‌పలోనూ భారత జట్టు గ్రూప్-డి నుంచే తలపడనుంది. చైనా, ఇంగ్లండ్, దక్షిణాఫ్రికా మహిళల జట్లతో కలిపి భారత్‌కు ఈ గ్రూప్‌లో చోటు దక్కింది.
ఇవి కూడా చదవండి:
ఐపీఎల్‌లో ఇంకా కలగానే ఆ ఆటగాళ్ల కోరిక!
NZ vs SA: సౌతాఫ్రికాపై న్యూజిలాండ్ ఘన విజయం