Share News

ఇంగ్లాండ్‌తో తొలి వన్డే.. భారత్ స్కోరు ఎంతంటే..

ABN , Publish Date - Jul 14 , 2026 | 09:00 PM

ఇంగ్లాండ్‌తో మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా నేడు బర్మింగ్‌హామ్‌లో జరుగుతున్న మొదటి మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లాండ్‌ భారత్‌ ముందు ఏకంగా 259 పరుగుల లక్ష్యాన్ని పెట్టింది. అనంతరం బరిలోకి దిగిన భారత్ 13 ఓవర్లు ముగిసేసరికి 2 వికెట్ల నష్టానికి 72 పరుగులు చేసింది.

ఇంగ్లాండ్‌తో తొలి వన్డే..  భారత్ స్కోరు ఎంతంటే..
Ind Vs Eng ODI

ఇంటర్నెట్ డెస్క్: ఇంగ్లాండ్‌తో మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా నేడు బర్మింగ్‌హామ్‌లో తొలి మ్యాచ్‌ జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లాండ్‌ భారత్‌ ముందు ఏకంగా 259 పరుగుల లక్ష్యాన్ని పెట్టింది. అనంతరం బరిలోకి దిగిన భారత్ 13 ఓవర్లు ముగిసేసరికి 2 వికెట్ల నష్టానికి 72 పరుగులు చేసింది. అయితే, ఓపెనర్లు రోహిత్ శర్మ (11), విరాట్ కోహ్లీ (5) స్వల్ప స్కోరుకే ఔట్ కావడం అభిమానులను నిరాశపరిచింది. అనంతరం బరిలోకి దిగిన శ్రేయస్ అయ్యర్, శుభ్‌మన్ గిల్ భారత ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే ప్రయత్నంలో ఉన్నారు.


టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లాండ్ 47.5 ఓవర్లలో 258 పరుగులకు ఆల్‌ఔట్ అయ్యింది. మొదట్లో బెన్ డకెట్, జాకబ్ బెథల్‌లు జట్టుకు శుభారంభాన్ని ఇచ్చారు. ఆ తరువాత టీం ఇంగ్లాండ్ తీవ్ర ఒడిదుడుకులను ఎదుర్కొంది. ఒకానొక దశలో 80 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ క్రమంలో డాసన్, రూట్ (76*) జట్టు ఇన్నింగ్స్‌ను సరిదిద్దారు. వీరు 121 పరుగుల భాగస్వామ్యాన్ని అందించడంతో జట్టు గౌరవప్రదమై స్కోరు చేయగలిగింది. ఆఖర్లో మళ్లీ భారత బౌలర్లు పుంజుకోవడంతో ఇంగ్లాండ్‌ 47.5 ఓవర్లకే ఆల్‌ఔట్ అయ్యింది. భారత్ బౌలర్లలో అక్షర్ పటేల్ 4, గుర్నూర్ బ్రార్ 2, ప్రసిద్ధ కృష్ణ 2, బుమ్రా, దూబే చెరో వికెట్ తీశారు.


ఈ వార్తలనూ చదవండి:

పునరాగమనాన్ని ఘనంగా చాటిన బుమ్రా.. జడేజాను అధిగమించి..

జపాన్ ఓపెన్ టోర్నీ: పీవీ సింధు శుభారంభం

Updated Date - Jul 14 , 2026 | 09:37 PM