Share News

విజృంభించిన ఇంగ్లండ్.. భారత్ లక్ష్యం ఎంతంటే..

ABN , Publish Date - Jul 11 , 2026 | 09:46 PM

భారత్‌తో జరుగుతున్న ఐదో టీ20 తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ బ్యాటర్లు విజృంభించారు. నిర్ణీత 20 ఓవర్లలో కేవలం 3 వికెట్ల నష్టానికి 257 పరుగుల భారీ స్కోరు చేశారు.

విజృంభించిన ఇంగ్లండ్.. భారత్ లక్ష్యం ఎంతంటే..
T20 Ind Vs Eng

ఇంటర్నెట్ డెస్క్: భారత్‌తో జరుగుతున్న ఐదో టీ20 తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ బ్యాటర్లు విజృంభించారు. నిర్ణీత 20 ఓవర్లలో కేవలం 3 వికెట్ల నష్టానికి 257 పరుగుల భారీ స్కోరు సాధించారు. తొలుత టాస్ గెలిచిన టీమిండియా బౌలింగ్ ఎంచుకుంది. రెండో ఓవర్‌లోనే ప్రసిద్ధ కృష్ణ ఇంగ్లండ్ ఓపెనర్ ఫిల్ సాల్ట్‌ను 6 పరుగులకే పెవిలియన్ బాట పట్టించాడు.

ఆ తరువాత బరిలోకి దిగిన టాప్ ఆర్డర్ బ్యాటర్లు పరుగుల వరద పారించారు. జాస్ బట్లర్, హ్యారీ బ్రూక్స్ భాగస్వామ్యం ముందు భారత బౌలర్లు నిలవలేకపోయారు. 64 బంతుల్లో జాస్ బట్లర్ ఏకంగా 131 పరుగులు రాబట్టాడు. 8 సిక్సులతో అభిమానులను ఉర్రూతలూగించాడు. చివరకు 19వ ఓవర్‌లో శివమ్ దూబే అతడిని పెవిలియన్ బాట పట్టించాడు. ఇక హ్యారీ బ్రూక్స్‌కూడా 45 బంతుల్లో 95 ⃰ పరుగులు స్కోర్ చేసి ఇంగ్లండ్‌ను పటిష్ఠ స్థితిలో నిలిపాడు. వీరిద్దరి భాగస్వామ్యంలో రికార్డు స్థాయిలో 233 పరుగులు వచ్చాయి.


జాస్ బట్లర్ తరువాత బరిలోకి వచ్చిన విల్ జాక్స్ కేవలం 9 పరుగులకే వెనుదిరిగాడు. 20 ఓవర్లు ముగిసే సరికి ఇంగ్లండ్ భారత్‌కు 258 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. భారత బౌలర్ ప్రసిద్ధ కృష్ణ ఒక వికెట్ తీయగా, శివమ్ దూబే రెండు వికెట్లు తీశాడు. ఈ సిరీస్‌లో ఇంగ్లండ్ 3-0తో ముందుంది. తొలి మ్యాచ్ వర్షం కారణంగా వాషౌట్ అయిన విషయం తెలిసిందే.


ఈ వార్తలనూ చదవండి:

ఇంగ్లండ్‌ను కూల్చిన క్రాంతి.. భారీ ఆధిక్యం దిశగా భారత్

స్టోక్స్ రిటైర్మెంట్ వీడియోపై రచ్చ.. ఈసీబీకి ఐసీసీ క్లీన్‌ చిట్!

Updated Date - Jul 11 , 2026 | 10:06 PM